Pavan Kalyan New House: పవన్ కళ్యాణ్ వారాహి విజయ బేరీయాత్ర కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ మొదలుపెట్టారు స్వల్ప కారణంగా పవన్ కళ్యాణ్ ప్రచారానికి బ్రేక్ పడింది 9 న పిఠాపురంలో సభ నిర్వహించనున్నారు. ఉగాదికి పవన్ పిఠాపురంలో కొత్త ఇంట్లోకి ప్రవేశించనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్లిమర్ల, విశాఖ పెందుర్తి నియోజకవర్గం పర్యటన షెడ్యూల్ ని త్వరలోనే ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన ,టిడిపి ,బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. అంతేకాక చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కొన్ని ఉమ్మడిగా బహిరంగ సభలకు హాజరుకానున్నారు .రోడ్ షోల్డర్ నిర్వహించడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక అలాగే బీజేపీ పెద్దలు కూడా త్వరలోనే ఏపీలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకోనున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తూ పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ఒక సభలో పవన్ మాట ఇచ్చారు .ఆ మాట ప్రకారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉండబోయే భవనం తుదిమెరుగులు దిద్దుకుంది చేబ్రోలుకు చెందిన అభ్యుదయ రైతు ఓదూరి నాగేశ్వరరావు ఈ భవనాన్ని నిర్మించారు పార్టీ కార్యకర్తల నిర్వహణ మరియు వసతికి ఈ ప్లేస్ అనువుగా ఉంటుందని చేబ్రోలులో తన కొత్త ఇంటిని పవన్ కళ్యాణ్ ఎంపిక చేయడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన పంట పొలాల్లో ఓదూరి నాగేశ్వరరావు మూడంతస్తుల భవనాన్ని నిర్మించి పవన్ కి ఇవ్వనున్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది వేడుకల్లో పాల్గొని తరువాత గృహప్రవేశం చేయనున్నారు. ఇల్లు మొత్తం మూడు ఫ్లోర్లుగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కు, మొదటి ఫోర్ లో ఆఫీసు నిర్వహణకు, రెండవ ఫ్లోర్ మూడో అంతస్తు కలిపి డూప్లెక్స్ గా పవన్ కళ్యాణ్ నివాసం ఉండడానికి అనువుగా నిర్మించినట్లు తెలుస్తోంది. ఓదూరి నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఇంటిని తానే స్వయంగా నిర్మించి పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇక దీనికి అద్దె కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లిస్తే చాలని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇక పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఇకనుంచి అన్ని కార్యక్రమాలు ఎలక్షన్స్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏంటి నుంచే మొదలు పెట్టనున్నారు ఏంటి సమీపంలో పంట పొలాల్లో హెలిపాడ్ ని కూడా నిర్మిస్తున్నారు. పవన్ ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం అనంతరం కాసేపు మాట్లాడుతూ రైతులకు క్షేమంగా ఉండాలని యువతకు ఉపాధి అవకాశాలు రావాలని మహిళల నిర్భయంగా తిరగగలిగేటటువంటి ధైర్యము కావాలని ఉద్యోగాలకు సకాలంలో జీతాలు రావాలని అందరూ ఆనందంగా ఉండాలని ఈ రోజు క్రోది నామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.