నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు ని గెలుపొందిన ఆనందం లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ , యంగ్ హీరో ‘విశ్వక్ సేన్ ‘ నటించిన ‘దాస్ క ధమ్కీ ‘ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు, RRR చిత్రం లోని ‘ నాటు నాటు ‘ సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడం లో డైరెక్టర్ రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి ,పాట ల రచయత చంద్రబోస్ ,సాంగ్ పాడిన రాహుల్ ,కాల భైరవ , డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ , అందులో నటించిన రామ్ చరణ్ ,నేను ఎంత కృషి చేసామో తెలుగు ప్రేక్షకులు ,అలానే భారత దేశం లో ఉన్న సినిమా ప్రేక్షకులు అంతే కారణం అని చెప్పారు.అక్కడ ఆస్కార్ వేదిక మీద ‘కీరవాణి ‘, ‘చంద్ర బోస్ ‘ గార్లు ఆస్కార్ అవార్డు తీసుకుంటూ ఉంటె చూడటానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అని , నాకు స్టేజి మీద కీరవాణి ,చంద్రబోస్ గార్లు కనిపించలేదు ఇద్దరు భారతీయులు అందరి తరుపున అక్కడ నిలుచుని ఆస్కార్ తీసుకున్నారు.
ఇక ‘దాస్ క ధమ్కీ’ సినిమా విషయానికి వస్తే నేను ఎప్పటి నుంచో విశ్వక్ సేన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సి ఉంది ,కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ వలన రాలేకపోయి ఉంటాను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి విశ్వక్ సేన్ ,తాను ఏంటో ఈ సమాజానికి చూపించుకోవడం కోసం తాను సినిమా పరిశ్రమ కి రాలేదు అని ,తన కి తనని నిరూపించుకోవడం కోసం మాత్రమే విశ్వక్ సేన్ వచ్చాడు అని ,అందులో తాను సక్సెస్ అయ్యాడు అన్నారు.
తాను ఏమైనా డెప్ప్రెషన్ లో ఉన్నపుడు కానీ ,లోన్లీ గా ఫీల్ అయినప్పుడు విశ్వక్ సేన్ రెండవ సినిమా అయినా ‘ ఈ నగరానికి ఏమైంది ‘ సినిమా చూస్తాను అని చెప్పారు, ఈ సినిమా లో విశ్వక్ కామెడీ చేయకుండానే కామెడీ పండించిన విధానం , లోపల అంతా బాధ పెట్టుకుని బయటకి కనిపించని విధం గా చేసే క్యారక్టర్ తనకి చాలా నచ్చింది అన్నారు, అలానే తన తో పాటు నటించిన ‘అభినయ్ ‘ క్యారక్టర్ కూడా సూపర్ అని చెప్పారు.
ఈ నగరానికి ఏమైంది లాంటి సూపర్ హిట్ వచ్చాక ,తానే డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ గా తీసిన ‘ఫాల్కనామ దాస్ ‘ సూపర్ హిట్ సాధించి విశ్వక్ సేన్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది అన్నారు, ఇక అలాంటి జోనర్ సినిమా లే తీయకుండా ‘పాగల్’, ‘హిట్ ‘, ;అశోక వనం లో అర్జున కళ్యాణం ‘ లాంటి సినిమా ల తో యూత్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు.
అయితే మన తెలుగు సినిమా పరిశ్రమ ఇండియన్ సినిమా ని ధాటి ప్రపంచ స్థాయి కి వెళ్తున్న తరుణం లో విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో లు మంచి మంచి సినిమా ల తో తెలుగు సినిమా కి గ్లోబల్ స్థాయి కి తీసుకుని వెళ్ళాలి అని , అలానే బయట చాలా మంది టాలెంట్ ఉన్న డైరెక్టర్ లు ,రచయత లు ఉన్నారు , వాళ్లకు అవకాశం ఇస్తే మంచి సినిమా లు తీస్తారు. దాస్ క ధమ్కీ తో బ్లాక్ బస్టర్ కొట్టి విశ్వక్ సేన్ డైరెక్షన్ మానేసి కొత్త డైరెక్టర్ ల కి అవకాశం ఇవ్వాలి అని అన్నారు.