Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

NAVADEEP:నేను గే ఏంట్రా ! గే కాదు అని అందరి ముందు ప్రూవ్ చేయలేను కదా అని నవదీప్ వ్యాఖ్యలు !

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అయినా నవదీప్ 2004 లో తేజ డైరెక్ట్ చేసిన జై సినిమా తో తెలుగు లో హీరో గా పరిచయం అయ్యారు,మొదటి సినిమా కమర్షియల్ గా హిట్ సాధించడమే కాకుండా తనకి మంచి పేరు ని కూడా తెచ్చి పెట్టింది.ఇక 2005 లో వచ్చిన గౌతమ్ SSC ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.సోలో హీరో గానే కాకుండా సెకండ్ హీరో గా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కూడా చేసిన నవదీప్,ఇప్పుడు వెబ్ సిరీస్ ల రూపం లో ఆహా లో ప్రారంభం కానున్న ‘న్యూసెన్స్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ద్వారా రాబోతున్నారు.ఈ చిత్రం లో నవదీప్ కి జోడి గా బిందు మాధవి నటిస్తున్నారు.సినిమా ,షో ల ద్వారా నే కాకుండా రూమర్లు ,వివాదాల రూపం లోను నవదీప్ వార్తలో ఉంటాడు.

మే 12 నా ఆహా లో రాబోతున్న తన కొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’ ప్రమోషన్ ల కి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో నవదీప్ తన మీద ఇది వరకు వచ్చిన వివాదాలు ,రూమర్ల మీద రెస్పాండ్ అయ్యాడు,2005 లో తన ఇంట్లో రేవ్ పార్టీ ల ను నిర్వహించాను అని అందులో ఒక అమ్మాయి నా వల్లనా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అప్పట్లో నా మీద చాల రాసారు
అసలు ఆ రోజు నా ఇంట్లో ఏ పార్టీ జరగలేదు ,మా అమ్మ గారితో రిసార్ట్ లో డిన్నర్ చేస్తున్న ఆ రోజు కానీ నా మీద అలాంటి వార్తలు రాసారు,నేను మాములుగా నా మీద వచ్చే రూమర్స్ ని పట్టించుకోను కానీ నేను ఒక గే అని నా మీద ఇంకొన్ని వార్తలు వచ్చాయి.నేను గే ని కాదు మగాడిని అని అందరి ముందు ప్రూవ్ చేయలేను కాదా అని చెప్పారు.ఇక మీద అయినా అలాంటి ఫేక్ వార్తలు చేయకుండా నిజాలను చెప్పాలని ఆశిస్తున్నా అని అన్నారు.

Exit mobile version