Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

కూటమి నాయకులు, కార్యకర్తల పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి

రూడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆదేశాల మేరకు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా & కమ్యూనికేషన్ శాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా కాకుండా, కాకినాడలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లే సందర్భంగా బూరుగుపూడి గేట్ వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆయనకు ఘనంగా, హృదయపూర్వక స్వాగతం పలకడం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, మంత్రివర్యులకు ఘన స్వాగతం పలకాలని కోరుతున్నాము.

ఈ కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ బలోపేతం, అభివృద్ధి పట్ల పార్టీ నిబద్ధతను మరింత స్పష్టంగా చాటే అవకాశం కలుగనుంది.

Exit mobile version