మెగా బ్రదర్ నాగబాబు ఏం చేసిన మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ లను పల్లెత్తు మాట అన్న వారిపై విరుచుకుపడటం నాగ బాబు స్టైల్. అన్నదమ్ముళ్లపై ఈగ వాలనివ్వనంత ప్రేమ నాగబాబుకు ఉంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ అంటుంటారు. ఈ క్రమంలో చిరంజీవి,పవన్ కళ్యాణ్ లని విమర్శించిన మంచు ఫ్యామిలీపై నాగబాబు తెగ ఫైర్ అయ్యాడు. తమ్మరెడ్డి భరద్వాజ్ ఈ మధ్య RRR సినిమా ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు చేసారు అనే వ్యాఖ్యల పైన కూడా ఘాటు గానే స్పందించారు.అది పక్కన పడితే,మరోసారి నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాగబాబు తన కుమార్తె నిహారికని ఎంతో గారాబం చేస్తుంటారు. నిహారిక ఏం చేసినా తండ్రిగా నాగబాబు గర్వపడుతుంటారు.
నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీలతో పాటు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. జంట చూడముచ్చటగా ఉందని అప్పట్లో వీరిపై ప్రశంసల జల్లు కురిసింది. మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అన్నారు. చైతన్యను అయితే మెగా అభిమానులు ‘బావ బావ’ అంటూ మోసేశారు. కానీ, ఇప్పుడు ఈ జంట విడిపోతోంది అనే వార్తలు విని వారంతా ఆందోళన చెందుతున్నారు.
నిహారిక, చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్‌ఫాలో చేయడం ఆశ్చర్యకరం. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
వాస్తవానికి వీరికి పెళ్లయిన ఏడాదిన్నరకే విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. కానీ, కిందటేడాది మార్చిలో నిహారికను ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చైతన్య ఒక పోస్ట్ చేశారు. దీంతో వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని,బాగానే ఉన్నారని ఒక క్లారిటీ వచ్చింది. కానీ, ఇప్పుడు మరోసారి విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. నిహారిక గత కొద్ది నెలలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేరు. ఆమె చివరిగా గతేడాది డిసెంబర్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇక చైతన్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ఫొటోను పోస్ట్ చేశారు. అయితే, ఆ ఫొటోకి ఇప్పుడు చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. బ్రేకప్ అట కదా, విడాకులు తీసుకుంటున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అన్ని విషయాల మీద అప్పటికి అప్పుడే రియాక్ట్ అయ్యే నాగబాబు గారు తన కూతురి విషయం లో మాత్రం నోరు విప్పకపోవడం తో సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు నిజమే అనిపిస్తుంది.