Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Nagababu : తమ్మా రెడ్డి భరద్వాజ పై విరుచుకుపడిన నాగబాబు

RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. మార్చి 12న జ‌ర‌గ‌బోయే అవార్డుల వేదికపై ఈ పాట విజేతగా నిలుస్తుందో లేదోన‌ని యావ‌త్ భార‌తం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ RRR ప్ర‌మోష‌న్స్ కోసం రూ.80 కోట్లు ఖ‌ర్చు పెట్టార‌ని, ఆ డ‌బ్బుతో 8 నుంచి 10 సినిమాలు చేయ‌వ‌చ్చున‌ని కామెంట్స్ పాస్ చేశారు. దీంతో త‌మ్మారెడ్డిపై సినీ పెద్ద‌లు రాఘ‌వేంద్ర‌రావు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు విరుచుకు ప‌డ్డారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అయితే నీయ‌మ్మా మొగుడు ఖ‌ర్చు పెట్టాడారా రూ.80 కోట్లు అంటూ ఘాటు ప‌ద‌జాలంతో రియాక్ట్ అయ్యారు.


సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీతో చ‌క్క‌టి అనుబంధంతో ఉండే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇలాంటి కామెంట్స్ చేయ‌డ‌ట‌మేంట‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు.అయితే ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేసారు తమ్మారెడ్డి భరద్వాజ. అందులో తాను RRR సినిమా గురించి తప్పు గా ఏమి మాట్లాడలేదు అని , ఒక చిన్న సినిమా ఫంక్షన్ లో ప్రస్తుత పరిస్థుతుల లో చిన్న సినిమా లు ఆడేలా లేవు అని అంటూ ,600 ,700 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా ఆస్కార్ అవార్డ్స్ ల కోసం 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు అని సరదా అన్నాను అని చెప్పారు ,సోషల్ మీడియా లో తన గురించి నెగటివ్ గా వస్తున్న వాటికి వివరణ ఇవ్వాలి అనుకున్నాను అని ,కాకపోతే ఈ లోపే సినిమా ఇండస్ట్రీ లో పెద్దలు గా చలామణి అవుతున్న వారు తన మీద ట్విట్ లు ,వీడియో లు పెడుతున్నారు అని అందుకే త్వరగా రెస్పాండ్ అవుతున్నాను అన్నారు.


నేను ఆ ఫంక్షన్ లో 3 గంటలు పైగా ఉన్నాను ,చాల సేపు చిన్న సినిమా ల గురించి మాట్లాడాను ,కానీ మీకు అవి అన్ని కనిపించవు , రెండు రోజులు ముందు RRR సినిమా గురించి ,రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడిన నేను ఎందుకు నెగటివ్ గా మాట్లాడతాను అన్నారు, నేను పాజిటివ్ గా మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవ్వని మీరు నేను సరదాగా అన్న మాటలను పట్టుకుని మాట్లాడుతున్నారు అన్నారు.సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద ,పెద్ద వాళ్ళ గురించి తనకి అన్ని తెలుసు అని,ఎవరు ఎవరు అవార్డ్స్ కోసం ఎవరి దగ్గర కి వెళ్లి అడిగారో అన్ని తన దగ్గర ఉన్నాయి అన్నారు.


ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడిన ఇండస్ట్రీ గురించి మాట్లాడినట్లే అవుతుంది కాబట్టి అవి అన్ని నేను ఇప్పుడు చెప్పాలి అనుకోవడం లేదు అంటూనే ,మా అమ్మ మొగుడు నన్ను బాగానే పెంచారు అని ,మంచి సంస్కారం నేర్పించారు అంటూ ,మీకే సంస్కారం లేక ఎవడో ఎక్కడో పెట్టిన చిన్న వీడియో బిట్ కి నన్ను ఇంతలా అంటున్నారు, న పేరు చెప్పుకుని మీరు సెలెబ్రెటీ లు అవ్వాలి అనుకునే నేను ఎం చేయలేను అని చెప్పి ముగించారు.

Exit mobile version