సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కెరీర్ టాప్ లో ఉంది అనే చెప్పాలి మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లు అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas),రాజమౌళి(Rajamouli) ల తో సినిమా లు చేస్తుండటం అంతకు ముందు రిలీజ్ అయినా సర్కారివారి పాట బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో మహేష్ బాబు గారి తదుపరి చిత్రాల మీద మంచి అంచనాలు ఉన్నాయి.ఇక త్రివిక్రమ్ గారితో ప్రస్తుతం చేస్తున్న SSMB28 నుంచి విరామం తీసుకుని ఫారీన్ వెళ్లిన మహేష్ బాబు తిరిగి ఇండియా కి వచ్చేసారు.ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ జూన్ మొదటి వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు.
SSMB28 సినిమా ని ఈ సంవత్సరం అక్టోబర్ కి కంప్లీట్ చేసి 2024 సంక్రాంతి కి ఈ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.రాజమౌళి తో చేస్తున్న సినిమా ని పాన్ ఇండియన్ స్థాయి నుంచి హాలీవుడ్ రేంజ్ లో ఫారెస్ట్ అడ్వాంచెర్ గా తీయనున్నారు..ఈ సినిమా ద్వారా మహేష్ బాబు గారికి మొదటి సరిగా పాన్ ఇండియన్ రిలీజ్ కానుంది.త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తికాగానే రాజమౌళి గారి సినిమా కి ప్రీ షూటింగ్ ,వర్క్ షాప్ చేయనున్నారు.ఇక ఈ రెండు సినిమా లు పూర్తి అయ్యాకే మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి సంబంధించిన న్యూస్ రానుంది.రాజమౌళి గారితో సినిమా అంటే తక్కువ లో తక్కువ ఒక రెండు సంవత్సరాలు అయినా టైం పడుతుంది.