Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

LIGER: విజయ్ దేవరకొండ లైగర్ మూవీ వలన 50 కోట్లు నష్టపోయాయము ! మాకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తాము అంటున్న తెలంగాణ బయర్స్ !

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,పూరి జగన్నాధ్ కలయిక లో ఎన్నో భారీ అంచనాల నడుమ గత సంవత్సరం ఆగష్టు 25 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయినా ‘లైగర్’ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా ని ఛార్మి ,పూరి ,కరణ్ జోహార్ ,అపూర్వ మెహతా కలిసి నిర్మించారు.ఈ సినిమా లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయినా మైక్ టైసన్ మొదటి సరిగా ఇండియన్ సినిమా లో నటించారు ,బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా వీరి తో పాటు
రోనిత్ రాయ్ ,మకరంద దేష్పాండే,చుంకి పాండే మొదలగు వారు నటించారు.

2022 ఆగష్టు 25 నా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ సినిమా గా రిలీజ్ అయినా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల తో పాటు హిందీ లోను మంచి బిజినెస్ చేసుకుంది,రిలీజ్ అయినా మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల లో భారీ నష్టాలను చూసింది హిందీ లో కరణ్ జోహార్ ఏ రిలీజ్ చేసుకోవడం తో తక్కువ నష్టాలను చూసాడు.అయితే తెలుగు రాష్ట్రాల లో దాదాపు గా 50 కోట్ల మేర నష్టాలను చూసారు సినిమా ని కొన్న బయర్స్.ఇది గత పది సంవత్సరాల లో ఎప్పుడు రాని నష్టాలూ అని చెప్తున్నారు సినిమా ని కొన్న బయర్స్, మొదట ఈ చిత్ర నిర్మాత ల లో ఒకరు అయినా ఛార్మి ,పూరి జగన్నాధ్ లు కొంత లాస్ ని భర్తీ చేస్తాం అని చెప్పిన ,కొంత మంది వారికి ఫోన్ చేసి ,బయట లేని పోనీ మాటలు అనడం తో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పారు.

ఇది పూర్తిగా వ్యాపారం సినిమా బ్లాక్ బస్టర్ అయితే వచ్చిన డబ్బులు ల లో మాకు ఏమి ఇవ్వరు అలానే ప్లాప్ అయినపుడు మేము ఎలా ఇస్తాము అని పూరి రివర్స్ అయ్యారు.ఇండస్ట్రీ లోని కొంత మంది పెద్దలు ఈ విషయం మీద మాట్లాడిన తర్వాత తన తర్వాత సినిమా లో వారి లాస్ ని కవర్ చేస్తాం అని మాట ఇచ్చారు పూరి,కానీ ఈ రోజు మే 12 నా తెలంగాణ బయర్స్ సమక్షం లో ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా కి దిగారు లైగ ర్ సినిమా ని కొని నష్టపోయిన వారు.తమకి న్యాయం చేయాలి అని ఈ సినిమా ద్వారా 50 కోట్ల నష్టాలను చూసాం అని సినీ ఇండస్ట్రీ పెద్దలు తమకి న్యాయం చేసే వరకు పోరాడతాం అని ధర్నా కి దిగారు.

Exit mobile version