Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Lavanya Tripathi: వరుణ్ తేజ్ కంటే ముందే లావణ్యకు ఆ మెగా హీరోతో సంబంధం?

lavanya tripathi relationship with mega family

Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల విషయం టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో వీరి గురించి రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. వీరి ప్రేమకు ఎక్కడ భీజం పడింది? ఎలా వీరు కలుసుకున్నారు? అని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు. వరుణ్ తేజ్ ( Varun Tej ), లావణ్య త్రిపాఠిలు కలిసి రెండు సినిమాల్లో నటించారు. రెండో సినిమాలో వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఆ తరువాత కొన్నేళ్ల తరువాత ఒక్కటి కాబోతున్నారు. అయితే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ తో కాకుండా చాలా సినిమాల్లో నటించారు. మెగా స్టార్ హీరోఅక్కినేని నాగార్జునతో కలిసి ఓ సినిమా చేశారు. ఈ సమయంలో లావణ్య త్రిపాఠికి అంతకుముందే ఓ మెగా హీరోతో చనువుగా ఉందని కొందరు కథనాలు బయటపెడుతున్నారు.

‘అందాల రాక్షసి’ అనే సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే ఫేమస్ అయింది. ఆ తరువాత భలే భలే మొగాడివోయ్, దూసుకెళ్తా లాంటి పలు సినిమాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ లావణ్య మెరిసిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఎందరితో నటించినా లావణ్య ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు. ఎవరినీ చేసినా సాధారణ వ్యక్తిగా మాత్రమే కనిపించారు. కానీ మెగా కుటుంబానికి చెందిన ఆ హీరో విషయంలో మాత్రం లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ తో కలిసి లావణ్య త్రిఫాటి ‘ఇంటలిజెండ్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న లావణ్య ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. కొందరు జర్నలిస్టులు మీ క్లోజ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ హజ్బెండ్ మెటిరీయల్ ఎవరని అడిగారు. దీంతో లావణ్య వెంటనే ‘సాయి ధరమ్ తేజ్ ’ అని చెప్పింది. నా సినీ కెరీర్ లో సాయి ధరమ్ తేజ్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదు.. అని చెప్పింది. ‘ఇంటలిజెంట్’ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఇదే సంవత్సరం వరుణ్ తేజ్ తో కలిసి ‘అంతరిక్షం’ సినిమాలో నటించింది. దీంతో కొన్ని నెలల గ్యాప్ తో ఆమె మనసు వరుణ్ తేజ్ వైపునకు మళ్లిందా? అని కొందరు కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇవన్నీ రూమర్స్ అని మెగా ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. సెలబ్రెటీలపై అనుచి కామెంట్స్ చేయడం కొందరికి అలవాటు అని విమర్శిస్తున్నారు.

Exit mobile version