2021 లో రిలీజ్ అయినా ఉప్పెన(Uppena) సినిమా ద్వారా తెలుగు సినిమా కి పరిచయం అయినా బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty).మొదటి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాకుండా డెబ్యూ మూవీ తో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా లో భాగం అయింది,వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగారాజు వంటి హిట్లు రావడం తో ఒక్క సరిగా తనకి డిమాండ్ తో పాటు వరుస ఆఫర్ లు వచ్చాయి.మొదట సినిమా కి 10 లక్షల రెమ్యూనిరేషన్ తీసుకున్న కృతి శెట్టి తన మూడవ సినిమా బంగారాజు కి ఏకంగా కోటి రూపాయల వరకు తీసుకున్నారు.హ్యాట్రిక్ హిట్ల తో జోరు మీద ఉన్న కృతి శెట్టి కి ఇప్పుడు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.
2021 లో ఉప్పెన ,శ్యామ్ సింగరాయ్ సినిమా ల తో బ్లాక్ బస్టర్ లు సాధించిన కృతి శెట్టి ,2022 ప్రధమార్ధం లో బంగారాజు తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది,అయితే తర్వాత తాను నటించిన ది వారియర్ మూవీ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఒకే సరి రిలీజ్ అయింది.రామ్ పోతినేని ,లింగు స్వామి కలయిక లో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది ,నితిన్ తో చేసిన మాచర్ల నియోజక వర్గం సినిమా కూడా ప్లాప్ గానే నిలిచింది.ఇక సుదీర్ బాబు హీరో గా కృతి శెట్టి డ్యూయల్ రోల్ చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా నిరాశ పరిచింది.
హ్యాట్రిక్ ప్లాప్ ల ను చుసిన కృతి శెట్టి ఎన్నో ఆశలను పెట్టుకున్న నాగ చైతన్య ‘కస్టడీ'(Custody) మూవీ కూడా డిజాస్టర్ అయింది.మొదట్లో వరుస విజయాలను చుసిన బేబమ్మ ఇప్పుడు వస్తున్న అపజయాలను చూసి భయపడుతున్నారు దానికి కారణం మన తెలుగు ఇండస్ట్రీ లో హిట్లు ఉన్న వారికే గుర్తింపు ఉంటుంది.మరి కస్టడీ సినిమా తర్వాత అయినా తాను సక్సెస్ ని చూస్తుందా లేదా ఇదే ప్లాప్ ట్రాక్ లో ఉంటుందా అనేది చూడాలి. తన ని లక్కీచార్మ్ అన్నవారే ఇప్పుడు తన పని అయిపోయింది అంటున్నారు.మరి ప్రొడ్యూసర్ లు సైతం కృతిశెట్టి ని తమ సినిమా ల లో పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారంటే ఆమె భవిష్యత్తు ఏంటి అనేది ప్రశార్ధకం గా మారింది.