Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

చిలకలూరిపేట ప్రజా గళం సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 300 కార్లతో బయలుదేరిన జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట మార్చి 17: టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలం, బొప్పూడిలోని ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద మార్చి 17, ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు జరుగుతున్న ‘ప్రజాగళం’ చారిత్రాత్మక భారీ బహిరంగ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి జగ్గంపేట గండేపల్లి కిర్లంపూడి గోకవరం మండలాల నుంచి 300 కార్లతో రావులమ్మ తల్లి ఆలయం వద్ద నుండి ఉదయం 9 గంటలకు జ్యోతుల నెహ్రూ జండా ఊపి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత మొట్టమొదటిగా బిజెపి, జనసేన, టిడిపి ఉమ్మడి వేదికగా ప్రజా గళం సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ, వి జినరీ నాయకుడు చంద్రబాబు, పోరాటయోధుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగే ఈ ప్రజా గళం సభ నుండి ఎన్నికల శంఖారావం పూరించడం జరుగుతుందని జగ్గంపేట నియోజకవర్గం నుండి 300 కార్లలో భారీగా తరలి వెళ్లడం జరుగుతుందని ఇంకా భారీగా బస్సులు ఏర్పాటు చేసుకుని వెళదాము అనుకున్నామని కానీ తొందరలోనే మన ప్రాంతంలో కూడా సభలు ఉంటాయని తెలియజేయడంతో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కార్యకర్తలతో వెళ్లడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, కోర్పు సాయి తేజ, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, మంగ రౌతు రామకృష్ణ, చదరం చంటిబాబు, కందుల చిట్టిబాబు, పరిమి బాబు, జాస్తి వసంత్, కుంచే రాజా, దాసరి తమ్మన్న దొర, దేవరపల్లి మూర్తి, అనుకూల శ్రీకాంత్, నీలం శ్రీను, కందుల బాబ్జి, కంటే సురేంద్ర, బస్వా వీరబాబు, తూము కుమార్, క్లస్టర్ ఇంచార్జ్, యూనిట్ ఇన్చార్జి, బూత్ కమిటీ ఇంచార్జ్ లు అధిక సంఖ్యలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు తరలి వెళ్లారు.

Exit mobile version