Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Jeevita rajasekhar: జీవిత ,రాజశేఖర్ ల ను కాపాడలేకపోయిన జగన్..

jagan and jeevitha

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ హీరో లు అయినా చిరంజీవి ,బాలకృష్ణ ,వెంకటేష్,నాగార్జున లాగానే రాజశేఖర్ గారికి కూడా సూపర్ స్టార్డం ఉంది,అప్పట్లో ఆయన చేసిన సినిమా ను పైన చెప్పిన హీరో ల సినిమా ల తో పోటీ పది బ్లాక్ బస్టర్ ల గా మిగిలిన సందర్భాలు చాల ఉన్నాయి రాజశేఖర్ గారు సినిమా ల లో అంత స్థాయి కి ఎదగడానికి ముఖ్య కారణం ఆయన భార్య అయినా జీవిత గారు.రాజశేఖర్ తో ఒకరి రెండు సినిమా ల లో హీరోయిన్ గా పని చేసిన జీవిత ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుని ఆయన తో తమిళ్ ,హిందీ ,మలయాళ లో సూపర్ హిట్ అయినా సినిమా ల ను ఇక్కడ రీమేక్ చేసి రాజశేఖర్ గారి సినీ కెరీర్ కి ఎంతగానో సపోర్ట్ గా ఉన్నారు.

సినిమా ల లో సక్సెస్ తగ్గిపోయిన తర్వాత చాల మంది సినిమా వాళ్ళు బయట బిజినెస్ లు కానీ లేక నిర్మాణ రంగం లోకి కానీ లేదా రాజకీయ ల లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది రాజశేఖర్ గారు తన సతీమణి అయినా జీవిత గారితో కలిసి మొదట గా వైస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.అదే టైం లో మెగా స్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు.అప్పుడే కాంగ్రెస్ లో చేరిన జీవిత ,రాజశేఖర్ ల కి వైస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన టాస్క్ చిరంజీవి గారిని తిట్టడం ,ఆయన్ని తన ఫ్యాన్స్ దగ్గర మైనస్ చేయడం.


2009 ఎలక్షన్ ల సమయం లో తెలుగు ఇండస్ట్రీ నుంచి అలానే కొంత మంది ని ప్రజారాజ్యం పార్టీ లోకి పంపి కో వర్ట్ లాగా పంపి పదే పదే చిరంజీవి గారిని టార్గెట్ చేసి లేని పోనీ నిందలు వేసేలా చేసారు.ఇక జీవిత రాజశేఖర్ లు అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు ,ఐ బ్యాంకు ల లో అవినీతి జరుగుతూ ఉంది.ప్రజల రక్తాన్ని చిరంజీవి క్యాష్ చేసుకుంటున్నారు అని తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ ఎక్కడ లేని ఆరోపణలు చేసారు.వీటికి అప్పట్లో చిరంజీవి గారు ధీటుగా సమాధాం చెప్పిన ,ఆయన ఫ్యాన్స్ రెచ్చిపోయిన తనకి ఉన్న మీడియా ల లో చిరంజీవి గారి మీద నెగటివ్ ప్రచారం చేసారు.


ఇటివంటి నిజాలు లేని ఆరోపణలు చేసిన జీవిత ,రాజశేఖర్ లు వైస్ రాజశేఖర్ లు ఇటీవల
జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా వైస్సార్సీపీ లో చేరిన సంగతి కూడా తెలిసిందే.జీవిత గారికి ఫిలిం ఇండస్ట్రీ కి సంబందించిన కీలమైన పదవి ఇస్తాను అని చెప్పిన జగన్ తాను సీఎం అయినా తర్వాత వీరిని పూర్తిగా మరిచిపోయారు.అప్పట్లో చిరంజీవి గారి మీద చేసిన ఆరోపణ ల లో నిజాలు లేకపోవడం తో వీరికి నాంపల్లి కోర్ట్ ఒక సంవత్సరం జైలు శిక్ష ఇంకా 5000 లు జరిమానా విధించారు.అల్లు అరవింద్ గారు వేసిన కేసు లు వీరికి 12 సంవత్సరాల తర్వాత శిక్ష పడటం తో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version