Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

2024 Elections:వైసీపీ కొంప ముంచిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్..వణుకు పుట్టిస్తున్న తాజా సర్వే!

Land Titling Act: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వైసీపీ పార్టీ ప్రభుత్వం ఎదురుకుంటున్న వ్యతిరేకత దేశం లో ఏ ప్రభుత్వం కూడా ఎదురుకోవడం లేదు. ఆ పార్టీ నాయకులూ బయటకి వచ్చి ఓట్లు అడిగితే జనాలు కొట్టి తరిమేసేంత పగతో రగిపోతున్నారు. ఈ 5 ఏళ్ళ దుర్మార్గపు పాలనలో ఒక్కటంటే ఒక్క రంగం కూడా అభివృద్ధిలోకి వచ్చిన దాఖలాలు లేవు. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం ఉంటుంది. అభివృద్ధి లేకుండా, కేవలం అప్పులతో మాత్రమే సంక్షేమం చేస్తే రాష్ట్రము దివాలా తీస్తుంది అనడానికి మన ఆంధ్ర ప్రదేశ్ ఒక ఉదాహరణ. జగన్ మోహన్ రెడ్డి తన ఓటు బ్యాంకుని కాపాడుకోవడం కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకాలు రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. కాగ్ అందించిన నివేదిక ప్రకారం మన రాష్ట్రం అక్షరాలా 13 లక్షల కోట్ల రూపాయిలు అప్పు చేసింది. వైజాగ్ నుండి సీమ వరకు సీఎం జగన్ ప్రభుత్వ ఆస్తులను, భూములను మొత్తం తాకట్టు పెట్టేసాడు.

దివాళా స్థితిలో ఉన్న మన రాష్ట్రాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క సంస్థ కూడా ముందుకు రావడం లేదు. చివరికి మన ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం ని కూడా తాకట్టు పెట్టేసాడంటే ఎంత దయనీయమైన పరిస్థితి లో ఆంధ్ర ప్రదేశ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాకట్టు పెట్టేందుకు ఏమి లేవు, అందుకే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తీసుకొచ్చాడు. ఈ యాక్ట్ ద్వారా మన భూములను కూడా తాకట్టు పెట్టే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు సీఎం జగన్.

జగన్ చేస్తున్న ఈ దుర్మార్గపు రాజకీయాలను పవన్ కళ్యాణ్, చంద్రబాబు జనాల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దీని గురించి పూర్తిగా అవగాహన రావడంతో ఇన్ని రోజులు సీఎం జగన్ కి సపోర్టు చేస్తున్న వారు కూడా అతనికి ఓటు వెయ్యడానికి భయపడుతున్నారు. ఒక ప్రముఖ సంస్థ రీసెంట్ గా చేసిన సర్వే ప్రకారం చూస్తే వైసీపీ పార్టీ కి ఈసారి కనీసం 20 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తుంది. కేవలం రాయలసీమ మినహా మిగిలిన అన్నీ చోట్ల అతి దారుణమైన ఫలితాలను సీఎం జగన్ ఎదురుకోబోతున్నాడని. ఈ ఫలితాలు చూసిన తర్వాత అతను రాజకీయ సన్యాసం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Exit mobile version