VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Ntr-Pawan kalyan:ఎన్టీఆర్ హామీ మేరకే పవన్ కళ్యాణ్ సినిమా ని రిలీజ్ చేసారా ?

టాలీవుడ్ స్టార్ హీరో లు అయినా పవన్ కళ్యాణ్ ,జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య మంచి స్నేహం ఉంది అనేది అందరికి తెలిసిందే..అయితే త్రివిక్రమ్ ,జూనియర్ ఎన్టీఆర్ ల అరవింద సమేత సినిమా ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ హాజరు కావడం ఆ సమయం లో జూనియర్ ఎన్టీఆర్ ,పవన్ ల మధ్య మంచి సంభాషణ జరగడం తో త్రివిక్రమ్ గారు పవన్ ,ఎన్టీఆర్(Ntr) ల మధ్య స్నేహం సెట్ చేసారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.కానీ వాస్తవానికి వీరి మధ్య స్నేహం ఇప్పటి నుంచో ఉంది.ఇక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ప్రముఖ నిర్మాత కొన్ని నిజాలను బయట పెట్టారు..

ntr pawan

పవన్ కళ్యాణ్(Pawan kalyan) గారు సినిమా ఇండస్ట్రీ లో చాల తక్కువ వారితో కలిసి ఉంటారు.అలా అని మిగతా వారితో మంచి సంబంధాలను కలిగి ఉండరు అని కాదు.ఒక అప్పుడు మహేష్ బాబు గారి అర్జున్ సినిమా పైరసీ జరిగినపుడు పవన్ కళ్యాణ్ గారు అందించిన సపోర్ట్,సహాయం ఎప్పటికి మరిచిపోలేనిది అని సాక్షాత్తు మహేష్ బాబు మరియు అతని సోదరి మంజుల చాల సార్లు చెప్పారు.పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే సహాయ సహకారాలు అందిస్తారో అలానే తనకీ కూడా మరో హీరో సపోర్ట్ గా నిలిచారు అనేది ఇప్పుడు తెలిసింది.అది మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్.

త్రివిక్రమ్(Trivikram) ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తరెంటికి దారేది మూవీ రిలీజ్ కి కొన్ని రోజులు ముందు మాస్టర్ ప్రింట్ ఆన్ లైన్ లో కి వచ్చేసింది.అన్ని కోట్లు ఖర్చు చేసిన సినిమా రిలీజ్ కి ముందు అందుబాటులోకి వస్తే ఇంకా ఎవరు కూడా సినిమా ని చూడరు.ఆ సమయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన హీరో ల ఫ్యాన్స్ మరియు ఇండస్ట్రీ అంత సపోర్ట్ ఇచ్చారు.ఆ సమయం లో ఆ సినిమా నిర్మాత అయినా భోగవల్లి ప్రసాద్ గారికి జూనియర్ ఎన్టీఆర్ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు అంట.సినిమా ని మీరు రిలీజ్ చేయండి నష్టం వస్తే మీకు నేను సినిమా ని ఫ్రీ గా చేసి పెడతాను అని మాట ఇచ్చారు ఎన్టీఆర్ అని ఇటీవల నిర్మాత ప్రసాద్ గారు చెప్పారు.ఇక అందరి అంచనాలను బద్దలు కొడుతూ అత్తరెంటికి దారేది (Atharentiki daredhi)ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 75 కొట్ల పైన కలెక్షన్స్ సాధించింది.

Exit mobile version