Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

హరిహర వీరమల్లు: ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు” చివరకు విడుదలకు సిద్ధమైంది. “ఇది పూర్తవుతుందా? కాదా?” అన్న అనుమానాల నడుమ ప్రారంభమైన ఈ చిత్రం, ఇప్పుడు మంచి హైప్‌తో విడుదల దశకు చేరుకుంది.

ఇది ఒకప్పుడు క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైంది. కానీ వివిధ కారణాల వల్ల ఆపబడింది. చివరకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో షూటింగ్ పూర్తయింది. నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ సినిమాను చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్‌గా తీసుకుని ధైర్యంగా నిలబడి విడుదల దశకు తీసుకురావడం ప్రశంసనీయం.

ఈ సినిమాపై మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని బయ్యర్స్, ట్రైలర్ విడుదలయ్యాక మూడ్ మార్చుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు అయితే మంచి ఫ్యాన్సీ రేట్లు చెల్లించి హక్కులు తీసుకుంటున్నారు. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లోనే కాదు, ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రం జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్ యాక్టివిటీస్‌కు జోరు పెరిగింది. ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైం 2 గంటలు 42 నిమిషాలు.

ఇండస్ట్రీ టాక్ ఎలా ఉంది?
సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్రంలోని విజువల్స్, ప్రొడక్షన్ విలువలు చాలా బావున్నాయని, ఇది పవన్ కళ్యాణ్‌కు సరైన టైమింగ్‌లో వచ్చిన సినిమా అవుతుందని అభిప్రాయపడినట్లు టాక్. పైగా, ముందే సినిమాను చూసిన బయ్యర్లు కూడా హ్యాపీగా అడ్వాన్స్‌లు ఇచ్చినట్టు వినిపిస్తోంది.

Exit mobile version