VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Guess the child: ఈ ఫోటో లో కనిపిస్తున్నా బుడ్డోడు ఇప్పుడు ఇండియా లోనే గొప్ప నటుడు !

ఈ ఫోటో లో కనిపిస్తున్నా బుడ్డోడు మన అందరికి బాగా తెలిసిన వ్యక్తే..మొదట చైల్డ్ యాక్టర్ గా కనిపించిన ఇతను 2001 లో తెలుగు సినిమా పరిశ్రమ లోకి హీరో గా అడుగు పెట్టాడు.మొదటి సినిమా తో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయాడు.ప్రస్తుతం ఇండియా లో ఉన్న టాప్ డైరెక్టర్ ల లో ఒకరితో తన రెండవ సినిమా కి చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.ఇక తన 18 వ సంవత్సరం లోనే అప్పటి స్టార్ హీరో ల కి పోటీ గా నిలబడి సత్తా చాటాడు.ఇక ప్రస్తుతం ఇతని పేరు యావత్ ప్రపంచం అంతటా మారు మ్రోగుతోంది..తెలుగు సినిమా స్థాయి ని పెంచిన ఇతను త్వరలోనే బాలీవుడ్ ,హాలీవుడ్ సినిమా ల లో నటించబోతున్నారు.అతను ఎవరో ఈ పాటికే మీకు అర్ధం అయి ఉంటుంది.నందమూరి తారక రామారావు గారి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్(Jr.Ntr).

junior ntr childhood picture

నందమూరి హరికృష్ణ గారి మూడవ కుమారుడు అయినా జూనియర్ ఎన్టీఆర్ అంటే రామారావు గారికి చాల ఇష్టం.. ఆ ఇష్టం తోనే తన పేరు నే తన మనవడికి పెట్టారు.తన పేరు ని నిలబెట్టే వాడు అవుతాడు అని చాల సార్లు రామారావు గారు చెప్పినట్లు హరికృష్ణ గారు చెప్పారు.మరి అదే స్థాయి లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరో లు వచ్చిన ఒక్క బాలకృష్ణ(Balakrishna) మినహా మిగిన వారు ఎవరు సక్సెస్ కాలేదు,కానీ బాలకృష్ణ గారు ఇండస్ట్రీ లో సక్సెస్ కోసం ఇబ్బంది పడుతున్న సమయం లో నందమూరి ఫ్యామిలీ లెగసె ని తన భుజాలమీద వేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరొక నటుడు కి లేదు అంటే ఆయన ఏ స్థాయి లో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.రాజమౌళి గారి తో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో తన నటన తో ప్రపంచ స్థాయి లో అభినందనలు పొందారు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ(Koratala shiva) గారితో తన 30 వ సినిమా దేవర అలానే కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్31 ,బాలీవుడ్ లో హ్రితిక్ తో వార్ 2 లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఇక మే 20 న తన 40 వ పుట్టిన రోజు జరుపుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ లో మరింత ఉన్నత స్థాయి కి ఎదగాలి కోరుకుందాం.

Exit mobile version