Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Gopichand: ప్రభాస్ తో కలిసి సినిమా చెయ్యడం కష్టం – గోపీచంద్

తెలుగు రాష్ట్రాల లో పరిచయం అవసరం లేని పేరు గోపీచంద్ ,సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ గారి కుమారుడు. గోపీచంద్ 2001 లో రిలీజ్ అయినా తొలివలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించారు,మొదటి సినిమా తో ఆశించిన విజయం అందుకోలేకపోయారు ,కానీ ఆ తర్వాత తేజ గారి డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమా లో చేసిన విలన్ రోల్ కి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నారు ,ఇక ఆ వెంటనే మహేష్ బాబు గారి నిజం మరియు ప్రభాస్ గారి తో వర్షం సినిమా లో కూడా మెయిన్ విలన్ గా నటించారు. అయితే వరుసగా చేసిన విలన్ రోల్స్ ల లో తన నటన ని చుసిన రవికుమార్ చౌదరి గారు యజ్ఞం సినిమా తో గోపీచంద్ గారిని హీరో గా రీ ఎంట్రీ చేసారు.

2004 లో రిలీజ్ అయినా యజ్ఞం సినిమా తో తన లోని నటన ని అద్భుతంగా ఆవిష్కరించిన గోపీచంద్ గారు ఆ వెంటనే ఆంధ్రుడు ,రణం ,లక్ష్యం ,సౌర్యం వంటి సినిమా ల తో స్టార్ హీరో గా ఎదిగారు.వరుసగా సూపర్ హిట్ లు చుసిన గోపీచంద్ గారు సౌర్యం సినిమా తర్వాత దాదాపు ఆరు సంవత్సరాలు హిట్ కోసం ఎదురుచూడక తప్పలేదు,లక్ష్యం సినిమా తో తనకి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీవాస్ గారు డైరెక్ట్ చేసిన లౌక్యం సినిమా తో మరో సారి సూపర్ డూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు గోపీచంద్ ,ఇక అప్పటి నుంచి మరో హిట్ కోసం గోపీచంద్ తో పాటు గా ఆయన అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు.

2014 లో రిలీజ్ అయినా లౌక్యం సినిమా తర్వాత గోపీచంద్ కి సరైన సక్సెస్ లేదు ,10 సంవత్సరాల తర్వాత మరల అటువంటి సక్సెస్ ని చూడబోతున్నారు అంటూ ఇటీవల జరిగిన భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ గారు తన అభిమానులని ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిజం అయ్యేలానే ఉన్నాయి,భీమా ట్రైలర్ లో తన అభిమానుల తో పాటు సగటు ప్రేక్షకుడు కి నచ్చేలా అన్ని అంశాలను సినిమా లో జోడించినట్లు తెలుస్తుంది.భీమా సినిమా కి సంబంధించిన ప్రొమోషన్ ల లో భాగంగా ఒక విలేకరు అడిగిన ప్రశ్న ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది.ఆ విలేకరు మాట్లాడుతూ మీరు ,ప్రభాస్ గారు మంచి స్నేహితులు కదా అప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాల ముందు వర్షం సినిమా లో కలిసి నటించారు మరల మీరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపించాలి అని అటు ప్రభాస్ మరియు మీ అభిమానుల తో పాటుగా సగటు సినిమా ప్రేక్షకుడు కూడా కోరుకుంటున్నారు అని అడిగారు.

ఆ విలేకరు అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ ..నేను సినిమా ల లోకి రాకముందు నుంచే నాకు ప్రభాస్ తో స్నేహం ఉంది ,నేను 2001 లో తొలివలపు తో ఎంట్రీ ఇస్తే 2002 లో ప్రభాస్ ఈశ్వర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చారు.అయితే కొన్ని కారణాల వలన నేను విలన్ రోల్స్ చేయడం,తన మూడవ సినిమా వర్షం లో ఇద్దరం కలిసి చేయడం అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం మాకు ఇద్దరికీ చాల సంతోషాన్ని ఇచ్చింది, బాహుబలి తో ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో గా తన కంటూ ఒక బ్రాండ్ ని సెట్ చేసుకున్నారు,అయినప్పటికీ చాల సార్లు మేము ఇద్దరం కలిసి చేయాలి అనుకున్నాం ,ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ లు కూడా కొన్ని కథల తో మమ్మల్ని కలిశారు .20 సంవత్సరాల తర్వాత మేము కలిసి నటించే సినిమా మీద అభిమాలకి ఎటువంటి అంచనాలు ఉంటాయో వాటిని అధిగమించేలా సినిమా ని తీయాలి అనేది మా ఇద్దరి ఆలోచన.అయితే అప్పుడు వర్షం సినిమా లో నేను విలన్ గా చేశాను కాబట్టి ఇప్పుడు చేసే సినిమా లో ప్రభాస్ విలన్ గా చేయాలి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఇప్పుడు ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్ లో కొంచెం లేట్ అయినా మంచి సినిమా తో మీ ముందుకు వస్తాము అని అన్నారు గోపీచంద్.

Exit mobile version