మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకడు గోపీచంద్.విలన్ గా అద్భుతంగా రాణించి, ఆ తర్వాత హీరో గా మారి సుమారుగా 30 సినిమాలు చేసాడు.వాటిల్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి,బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి మరియు డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే గత కొంతకాలం నుండి గోపీచంద్ కి సరైన సూపర్ హిట్ సినిమా లేదు. ఆయన మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది,ఆయన చివరి చిత్రం మారుతి దర్శకత్వం లో వచ్చిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫ్లాప్ గా నిల్చింది.ఇక ఆ తర్వాత ఆయన తనకి బాగా కలిసొచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో కలిసి ‘రామబాణం’ అనే సినిమా చేసాడు.ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.
అందువల్ల ఓపెనింగ్స్ కూడా డిజాస్టర్ రేంజ్ లోనే వచ్చాయి, ప్రాంతాల వారీగా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూస్తే గోపీచంద్ మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, ఇది చాలా తక్కువ అనొచ్చు, ఎందుకంటే గోపీచంద్ గత చిత్రం ‘పక్కా కమర్షియల్’ కి ఈ ప్రాంతం లో మొదటి రోజు కోటి రూపాయిల షేర్ వచ్చింది.అలాగే సీడెడ్ లో 21 లక్షలు, ఉత్తరాంధ్ర లో 14 లక్షలు, ఈస్ట్ గోదావరి లో 9 లక్షలు, వెస్ట్ గోదావరి లో 6 లక్షలు , గుంటూరు లో 8 లక్షలు, కృష్ణ లో 8 లక్షలు మరియు నెల్లూరు లో 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.అలాగే ఓవర్సీస్ మరియు కర్ణాటక కూడా కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కోటి 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 15 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది.కానీ ట్రెండ్ చూస్తూ ఉంటే వీకెండ్ కి మూడు కోట్లు కూడా రాబట్టే ఛాన్స్ కనిపించడం లేదు.రెండవ రోజు అన్నీ చోట్ల వసూళ్లు దారుణంగా పడిపోయాయి.వర్కింగ్ డేస్ లో కచ్చితంగా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టడం తప్పనిసరి, కానీ అది అసాధ్యం. కాబట్టి ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిపోబోతుంది.గోపీచంద్ ఇప్పటికైనా నాసిరకం స్టోరిల నుండి బయటకి వచ్చి, కొత్త ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు చెయ్యాలి,అప్పుడే ఆయన సక్సెస్ సాధించగలడు.లేకుంటే మళ్ళీ ఆయన విలన్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు.