తొలివలపు సినిమా ద్వారా మొదట హీరో గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత ఇండస్ట్రీ లో మంచి బ్రేక్ కోసం విల్లన్ గా నటించారు ,తేజ గారి జయం సినిమా ద్వారా విల్లన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ ఆ తర్వాత మహేష్ బాబు గారి నిజం ,ప్రభాస్ తో వర్షం సినిమా లో విల్లన్ గా చేసారు.. 2004 లో రిలీజ్ అయినా యజ్ఞం సినిమా ద్వారా కమర్షియల్ గా సూపర్ హిట్ సాధించారు ఆ తర్వాత ఆంధ్రుడు ,రణం ,లక్ష్యం,లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ ల లో నటించారు ,లౌక్యం తర్వాత ఆ స్థాయి హిట్ లేని గోపీచంద్ ,ఎన్నో సినిమా ల ను చేస్తున్నప్పటికీ కమర్షియల్ గా హిట్ మాత్రం దక్కడం లేదు.
లక్ష్యం ,లౌక్యం వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ తో మూడో సారి కలిసి చేసిన రామబాణం సినిమా మే 5 న రిలీజ్ అయ్యి నిరాశపరిచింది.హ్యాట్రిక్ కాంబినేషన్ కావడం తో భారీ అంచనాలను నడుమ రిలీజ్ అయినా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమా ప్రొమోషన్ ల లో భాగం గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అడిగిన ఒక ప్రశ్న కు గోపీచంద్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది..
మీ గత సినిమా ల లో ఇది పక్క హిట్ అవుతుంది అనుకుని ప్లాప్ అయినా సినిమా లు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్న కు నా సినిమా ల లో నాకు బాగా నచ్చినవి ఒక్కడున్నాడు ,ఒంటరి,సాహసం ,మొగుడు ,గౌతమ్ నంద.వీటి లో చంద్రశేఖర్ యేలేటి గారితో చేసిన ఒక్కడున్నాడు ,సాహసం సినిమా లు చాల పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా లు ,కానీ అప్పుడు సరిగా ఆడలేదు.ఆ రెండు సినిమా లు ఇప్పుడు కానీ రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ హిట్లు అవుతాయి అని అన్నారు.అయితే గోపీచంద్ గారు చెప్పిన ఆ రెండు ఒక్కడున్నాడు ,సాహసం తో పాటు గౌతమ్ నంద మూవీ కూడా చాల బావుటుంది కానీ ఎందుకు ప్లాప్ అయిందో తెలియదు.