తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనవరి 4: కోరుకొండ మండలం గాడాల గ్రామం, సీతానగరం మండలం సీతానగరం లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు కు రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యదర్శి అయిన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు
ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ఇప్పటివరకు పదో తరగతి వరకు నిర్వహించే వారిని ఈరోజు నుండి జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఈ భోజన పథకం వర్తిస్తుందని దీనికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దానగుణం గల వ్యక్తుల పేర్లు ఏదైనా మంచి పథకాలకు పేర్లు పెట్టినట్లయితే వారిలోని మంచితనం మీరందరూ కూడా గ్రహించి రేపు పెద్దయిన తర్వాత మీరు కూడా దయ, కరుణ గుణాలతో పదిమందికి సహాయం చేస్తారని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని డొక్కా సీతమ్మ బ్రిటిష్ పాలకుల కాలంలో రాజోలు గన్నవరం గోదావరి తీర ప్రాంతంలో పడవలపై ప్రయాణించే వారికి భోజనం వసతి కల్పించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని అటువంటి డొక్కా సీతమ్మ పేరు ఇప్పటినుండి మధ్యాహ్న భోజన పథకం కి నామకరణం చేయడం జరిగిందని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆయన పేరులు తప్ప ఎవరి పేర్లు పథకాలకు పెట్టడం చేతకాలేదని ఆయన ఎద్దేవా చేశారు. మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో NDA నాయకులు కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.