VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Soundarya: వామ్మో..సౌందర్య కి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? చూస్తే ఆశ్చర్యపోతారు

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్ లు వచ్చిన సౌందర్య(Soundarya) లాంటి హీరోయిన్ ఇకపైన రారు అంటారు చాల మంది దానికి కారణం ఆమె సహజమైన నటన మరియు సాంప్రదాయ పద్ధతి లో అచ్చం తెలుగు అమ్మాయి ల కనిపించే ఆమె రూపం.కన్నడ అమ్మాయి అయినా సౌందర్య మన తెలుగు లో మానవరాలిపెళ్లి సినిమా ద్వారా తన ఎంట్రీ ఇచ్చారు.తన రెండవ సినిమా అయినా రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ సూపర్ హిట్ కావడం తో సౌందర్య కి తెలుగు లో ఈమెకి మంచి అవకాశాలు లభించాయి.SV కృష్ణారెడ్డి గారి మాయలోడు,నెంబర్ వన్ ,టాప్ హీరో లాంటి సినిమా లో నటించి  స్టార్ హీరో ల సరసన నటించే ఛాన్స్ అందుకున్నారు.

soundarya with jagapathi

టాలీవుడ్ లో టాప్ హీరోలు అయినా చిరంజీవి,బాలకృష్ణ ,నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరో ల తో చేసి అప్పట్లో హైయెస్ట్ రెమ్యూనిరేషన్ మరియు బిజీ హీరోయిన్ గా ఉన్నారు. ఫ్యామిలీ హీరో లు అయినా జగపతి బాబు ,శ్రీకాంత్ గార్ల తో కూడా సూపర్ డూపర్ హిట్ సినిమా ల లో నటించారు సౌందర్య.అప్పట్లో సౌందర్య హీరో జగపతి బాబు(Jagapathi babu) తో ప్రేమయం నడిపింది అనే వార్తలు ఉన్నాయి.ఇదే విషయం ని ఇటీవల జగపతి బాబు ని అడగక సౌందర్య తనకి మంచి ఫ్రెండ్ అని చెప్పాడు.ఇక  కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన అంతఃపురం సినిమా సౌందర్య గారికి ఎక్కడ లేని గుర్తింపు తో పాటు ఫిలిం ఫేర్ అవార్డు ని కూడా తెచ్చిపెట్టింది.

అంతఃపురం(Anthapuram) సినిమా లో సౌందర్య ,జగపతి బాబు,ప్రకాష్ రాజ్ ,సాయి కుమార్ ల కి ఎంత గుర్తింపు వచ్చిందో అంతే గుర్తింపు మరొకరికి కూడా వచ్చింది,అది ఎవరో కాదు ఈ సినిమా లో సౌందర్య గారికి కొడుకు గా నటించిన చిన్న బాబు కి.ఈ సినిమా లో నటించేటప్పటికీ ఆ బాబు కి రెండు సంవత్సరాలు.ఆ బాబు పేరు కృష్ణ ప్రదీప్(Krishna pradeep).తన చిన్నతనం లోనే తండ్రి ని కోల్పోయి అటు అమ్మ ప్రేమకి ,తాతయ్య ప్రేమ కి మధ్య నలిగిపోయే చిన్న బాబు పాత్రా లో ఒదిగిపోయిన కృష్ణ ప్రదీప్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు.27 సంవత్సరాల వయస్సు ఉన్న కృష్ణ ప్రదీప్ తన చదువు ని ముగుంచుకుని సినిమా ల లో అవాకాశాల కోసం చూస్తున్నారు సోషల్ మీడియా ల లో ఆక్టివ్ గా ఉండే కృష్ణ ప్రదీప్ నేటి తరం హీరో ల కి ఏ మాత్రం తీసి పోకుండా తన కట్ అవుట్ ని చూసుకుంటాడు.మరి వెండితెర సౌందర్య కొడుకు త్వరలోనే సినిమా ల లో ఎంట్రీ ఇవ్వనున్నారు.

Exit mobile version