VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Mahesh babu: బాలీవుడ్ టాప్ హీరోను ఢీ కొడుతున్న మహేష్ ఆస్ట్రాంగ్ హీరో ఎవరో తెలుసా?

‘ఆర్ఆర్ఆర్'(RRR) తరువాత రాజమౌళి(Rajamouli) సినిమా పై అందరికీ ఆసక్తిగా మారింది. తన నెక్స్్ట మూవీ మహేష్ బాబు తో ఉంటుందన్న విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. భారీ బడ్జెట్ తో పాటు పాన్ వరల్డ్ లెవల్లో సినిమా ను తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే చాలా విషయాలు బయటికి వచ్చాయి. లేటెస్ట్ గా ఓ హాట్ టాపిక్ సినీ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేష్ బాబు తో బాలీవుడ్ గ్రేట్ హీరో ఢీకొట్టబోతున్నాడు. ఆయనెవరో తెలిస్తే షాక్ కాకుండా ఉండదు.

ssr and mahesh

జక్కన్నగత సినిమా ట్రిపుల్ ఆర్ లో బాలీవుడ్ నటులను పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నాడు. తాను మహేష్ తో తీయబోయే చిత్రంలో బీ టౌన్ నుంచి ఓ మెగా హీరోను రంగంలోకి దించుతున్నాడు. ఆయన ఎవరో కాదు.అమీర్ ఖాన్..బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్(Amir khan) కు పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ సక్సెస్ అయ్యాయి. ఇప్పటి వరకు అమీర్ ఖాన్ తెలుగులో నటించలేదు. ఇప్పుడు ఆయన ఏకంగా మహేష్(Mahesh babu) తో తలపడనున్నాడు. అంటే మహేష్ సినిమాలో అమీర్ విలన్ గా నటిస్తున్నాడన్నమాట..

బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు వదులుకోవడం లేదు. అదీ రాజమౌళి సినిమా ను మిస్ చేసుకోవడం అంటే జాక్ పాన్ ను వదులుకున్నట్లే.. అయితే ఈ విషయం పై క్లారిటీ రావాలి. ఎందుకంటే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో హీరోగా నటించిన ఆయన మహేష్ తో దెబ్బలు తినడానికి ఒప్పుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే మహేష్ పక్కన నటించే హీరోయిన్ ఎవరా ?అని ఇంతకాలం సస్పెన్స్ కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ భామ ఎవరో కాదు.. దీపికా పదుకొనే అని ప్రచారం జరుగుతుంది.మరి దీనిపై జక్కన్న క్లారిటీ ఇవ్వాలి.

 

Exit mobile version