టాలీవుడ్ లో 1990 ల లో టాప్ హీరో లు గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ,బాలకృష్ణ లు ఒకరికి ఒకరు పోటీ గా సినిమా లు చేస్తూ వారి టాప్ ప్లేస్ లో ఉన్న సమయం లో అప్పటి స్టార్ హీరోయిన్ గా ఉన్న ఒక హీరోయిన్ వీరి ఇద్దరికీ పోటీ గా వచ్చింది.అప్పటి వరకు వీరితో సూపర్ హిట్ సినిమా ల లో కనిపించిన ఈమె వీరితో పోటీ పడి మరి సోలో హీరోయిన్ గా సినిమా లు చేసి సక్సెస్ అయింది చిరంజీవి ,బాలకృష్ణ ల తో ఇండస్ట్రీ హిట్ సినిమా ల లో నటించిన ఆ హీరోయిన్ బాలకృష్ణ తో ప్రేమాయణం కూడా నడిపింది అని అప్పట్లో టాక్ ఉంది.వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది అని రామారావు గారికి నచ్చకపోవడం తో ఈ పెళ్లి ఆగిపోయింది అంటారు.
ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలిసి ఉంటుంది.1981 లో రిలీజ్ అయినా సత్యం శివమ్ సినిమా లో శాంతి క్యారెక్టర్ తో తెలుగు సినిమా కి పరిచయం అయ్యి ఆ తర్వాత లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన విజయ శాంతి(Vijaya shanthi).మొదట సైడ్ క్యారెక్టర్ ల లో నటించిన ఈమె ఆ తర్వాత పెద్ద హీరో ల పక్కన హీరోయిన్ గా నటించారు.ముఖ్యంగా చిరంజీవి గారితో ఈమెది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు.ఛాలెంజ్ ,పసివాడిప్రాణం ,యముడికి మొగుడు ,గ్యాంగ్ లీడర్ వంటి సినిమా లు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్లు గా ఉన్నాయి.
చిరంజీవి గారితో ఎలా అయితే సూపర్ హిట్ సినిమా లు ఉన్నాయో బాలకృష్ణ(Balakrishna) గారితో కూడా నటించారు విజయ శాంతి,ముద్దలు మావయ్య ,లారీ డ్రైవర్ ,రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్ ల లో నటించడమే కాకుండా బాలయ్య తో మంచి స్నేహం తో ఉండే వారు విజయ శాంతి.అప్పట్లో వీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అనే టాక్ కూడా ఉండేది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ,లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి 1990 లో లేడీ ఒరింటెడ్ సినిమా లు తీయడం అవి బ్లాక్ బస్టర్ హిట్లు కావడం తో తనకంటూ సెపెరేట్ మార్కెట్ ఏర్పడింది.ఇక అదే సమయం లో బాలయ్య ,చిరు సినిమా ల లో నటించడం ఆపేసేంది.తనని మెయిన్ లీడ్ లో పెట్టి సినిమా చేస్తున్న నిర్మాతలకి నష్టం వస్తుంది అని స్టార్ హీరో ల సరసన హీరోయిన్ గా చేయడం లేదు అని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ,వాస్తవానికి అయితే అప్పటి స్టార్ హీరో లు అయినా చిరంజీవి ,బాలకృష్ణ ,వెంకటేష్ ,నాగార్జున ల కి తాను ఏమి తక్కువ కాదు అనే గర్వం తో విజయశాంతి ఉండే వారు అంటారు.