VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Mohan babu: సోదరుడు మోహన్ బాబు హీరో అయితే.. రంగస్వామినాయుడు ఏం చేసేవారో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు అశేష అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన సినిమాలు వరుసగా హిట్టయ్యేవి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ కు మోహన్ బాబు పోటీ ఇచ్చేవారు. ఈ పోటీ ఇండస్ట్రీలోనే కానీ.. రియల్ గా కాదు.. నిజ జీవితంలో వీరంతా ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్లు.. సినిమాల్లో లాగే రియల్ గా తన పదునైన మాటలతో మోహన్ బాబు అందరినీ అలరిస్తుంటారు. అలాంటి మోహన్ బాబు(Mohan babu) ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఎంతో ఆప్యాయంగా చూసుకునే తన సోదరుడు రంగస్వామి మరణించాడు. అయితే మోహన్ బాబు ఇంత పెద్ద సినీ యాక్టర్ అయితే రంగస్వామి ఏం చేసేవాడో తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

mohan babu brother

తెలుగు చిత్ర సీమలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలనాడు ఫీల్డ్ లోకి భక్తవత్సలనాయుడు అనే మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చి తన వారసులను కూడా పరిశ్రమలోకి తీసుకొచ్చారు. ఆయన తరువాత మంచు విష్ణు(Vishnu), మంచు మనోజ్(Manoj), లక్ష్మీలు సినీ రంగంలో అడుగుపెట్టారు. అయితే మంచు ఫ్యామిలీ తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తమ డైలాగ్స్ తో కుర్రాళ్లలో ఊపు తెస్తారు.

మోహన్ బాబు ఫ్యామిలీ విషయానికొస్తే వీరు మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయనకు సోదరుడు ఉన్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. మోహన్ బాబు ఎంతో ఆప్యాయతంగా గౌరవించే తన సోదరుడు రంగస్వామి ఉన్నారు. ఆయన వ్యవసాయం చేసి జీవనం కొనసాగించేవారు. అయితే తన సోదరుడు మోహన్ బాబు అంత పెద్ద హీరో, నిర్మాత అయినా తన గురించి ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. అంతేకాకుండా మంచు ఫ్యామిలీలో ఆయన అస్సలు జోక్యం చేసుకోలేదు.

కానీ రంగస్వామి నాయుడు అంటే మంచు ఫ్యామిలీకి ఎంతో గౌరవం ఉండేది. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీలు ఆయనతో చనువుగా ఉండేవారు. ఆయన ఇంట్లోకి వెళ్తూ సందడి చేసేవారు. మోహన్ బాబు ఫ్యామిలీ సినీ రంగంలో ఉన్నా ఆయన ఎప్పుడు వారి పరపతి ఉపయోగించుకోలేదని, అలాంటి వ్యక్తి మా మధ్య లేకపోవడం బాధగా ఉందని మంచు ఫ్యామిలీ చెబుతూ కన్నీరు కారుస్తోంది. ఈ సందర్బంగా సినీ ప్రముఖులంతా మోహన్ బాబును ఓదారుస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version