టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న నటుడు మన ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు.తన సినీ కెరీర్ లో దాదాపు 170 పైన సినిమా ల లో నటించారు.1989 లో సింహ స్వప్నం సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత తన కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరుచుకుని ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా ల లో నటించారు.తన తండ్రి గారు అయినా వి బి రాజేంద్రప్రసాద్ గారి బ్యానర్ జగపతి పిక్చర్స్ ని ముందుకు తీసుకుని పోవడం లో జగపతి బాబు గారి పాత్రా కూడా ఎంతగానో ఉంది.పెళ్లైన కొత్తల్లో సినిమా తర్వాత కమర్షియల్ సినిమా లేని జగపతి బాబు గారు 2013 తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని సరికొత్త కోణం లో స్టార్ట్ చేసారు.
జగపతి బాబు గారికి ఉన్న మంచి గుణగణాల తో ఆయన చాల మందికి సహాయం చేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాక దాదాపు రోడ్ మీద కి వచ్చేసిన టైం లో బోయపాటి శీను డైరెక్షన్ లో బాలయ్య బాబు గారి పక్కన విలన్ గా చేసిన లెజెండ్ సినిమా తో విలన్ గా చేసారు
2014 లో రిలీజ్ అయినా లెజెండ్ సినిమా లో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఎంతగా పండిందో అంతే స్థాయి లో జితేంద్ర క్యారెక్టర్ లో జగపతి బాబు గారు అలరించారు.ఇక అప్పటి వరకు ఆర్ధిక సమస్యల లో ఉన్న ఆయనికి వరుసగా పెద్ద పెద్ద సినిమా ల లో మెయిన్ విలన్,సపోర్టింగ్ రోల్స్ చేయడం తో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఎమర్జింగ్ యాక్టర్ గా అయ్యారు.
రంగస్థలం లో ప్రెసిడెంట్ పాత్రా లో ఆయన చేసిన క్యారెక్టర్ ,అరవింద సమేత లో చేసిన క్యారెక్టర్ తో జగపతి బాబు గారి రేంజ్ డబుల్ అయింది అనే చెప్పాలి.మెగాస్టార్ సైరా లో మంచి క్యారెక్టర్ కూడా చేసారు.ఇక ప్రస్తుతం ప్రభాస్ గారి సాలార్ ,అల్లు అర్జున్ గారి పుష్ప 2 ల తో పాటు మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా లోను చేస్తున్నారు.అయితే లెజెండ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన ప్రస్తుతం ప్రతి సినిమా కి 3 నుంచి 5 కోట్ల రెమ్యూనిరేషన్ ని తీసుకుని 150 కోట్ల నెట్ వర్త్ ని కలిగి ఉన్నారు.తాను ఎక్కడ అయితే పోగొట్టుకున్నాడో అక్కడే మరల సంపాదించుకున్నాడు జగపతి బాబు గారు.