ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ హీరో ల కి పోటీగా తన కంటూ ప్రత్యకమైన స్థానం కలిగిన నటి సావిత్రి.ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో జన్మించిన సావిత్రి(Savitri) మొదట్లో నాటకాలు వేసి ఆ తర్వాత వాళ్ళ పెదనాన్న గారి సహాయం తో మద్రాస్ వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించారు..13 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సావిత్రి.స్టార్ హీరో లు అయినా MGR ,శివాజీ గణేశన్ ,జెమినీ గణేశన్ ,రామారావు ,నాగేశ్వర రావు లాంటి లెజెండ్ ల తో నటించారు.కెరీర్ ప్రారంభం లోనే జెమినీ గణేశన్ తో ప్రేమ లో పడి ఆయనని వివాహం చేసుకుని ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఎదిగారు.
సావిత్రి గారు సినిమా ల లో అవకాశాలు వచ్చే సమయానికి ఆమె వయస్సు 14 సంవత్సరాలు ఉండటం తో మొదట ఆ అవకాశాలను చేర్చకున్నారు..ఆ తర్వాత 1950 లో సంసారం సినిమా తో ఎంట్రీ ఇచ్చారు.చాల తక్కువ సమయం లోనే పాతాళ భైరవి ,పెళ్లి చేసి చూడు,దేవదాసు వంటి సినిమా ల తో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.అప్పటి స్టార్ హీరో ల తో సమానంగా సావిత్రి కి రెమ్యూనిరేషన్ ఇచ్చే వారు.రామారావు(Ramarao) ,నాగేశ్వర రావు గార్ల తో చేసిన సినిమా ల లో హీరో ల కంటే ఆమెకే ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే సావిత్రి గారి స్థాయి ఎలాంటిదో అర్ధం అవుతుంది.
1957 లో రిలీజ్ అయినా మాయబజార్ సినిమా లో సావిత్రి గారు చేసిన శశిరేఖ పాత్ర ఎంత హైలైట్ అయిందో ఇప్పటికి ఆ సినిమా టీవీ ల లో వస్తే తెలుస్తుంది.తన కి ఉన్న బిజీ సినిమా షూటింగ్ ల తో తాను ఎంత సంపాదిస్తున్నాను ,ఎంత ఖర్చు చేస్తున్నాను అని తెలియకుండా సంపాదించారు సావిత్రి.అప్పటి స్టార్ డైరెక్టర్ లు ,ప్రొడ్యూసర్ లు మొదట సావిత్రి గారి డేట్స్ ని బుక్ చేసుకుని ఆ తర్వాత హీరో ల ని సంప్రదించే వారు.తన పెళ్లి తర్వాత తన ఆస్తులు ల ను భర్త జెమినీ గణేశన్ చూసుకునే వారు..తన పెళ్లి అయినా వెంటనే చెన్నై లో 5 ఎకరాల లో ఇంద్రభవనం వంటి భారీ ఇంటిని కొనుగోలు చేసారు.ఇంట్లో ప్రతి వస్తువు ని కూడా బంగారం ,వెండి తో చేయించారు..
తనకి మొదటి నుంచి కూడా కార్స్ అంటే ఇష్టం ఎక్కువ ఉండటం తో ఇండియా లో ఏ కొత్త మోడల్ కార్ వచ్చిన సావిత్రి గారు దానిని కోనేసేవారు.ఇండియా లో పలు నగరాల లో సొంత ఇల్లు లను కొనుగోలు చేసారు.ఈ స్థాయి రావడానికి కారణం అయినా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్ టైం గుర్తు ఉండిపోయేంత డబ్బు ,నగలు ఇచ్చారు. ఎంత సంపాందించిందో
అంతకు మించి చారిటీ ల కి ఇచ్చారు.తోటి నటుల వలే తాను కూడా ఏదైనా బిజినెస్ ల లో పెట్టుబడులు పెట్టి ఉంటె ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ల లో సావిత్రి గారిని మించిన ధనవంతులు ఉండేవారు కాదు అనేది నిజం.దురదృష్టం ఆమె చేసిన మంచి ఆమెకి శాపం గా మారింది.చివరి క్షణాల లో సావిత్రి గారు పడిన ఇబ్బందులు అంత ఇంత కాదు..