Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Biggboss Aswini: మహేష్ బాబు తో బిగ్ బాస్ అశ్వినీ ఈ రేంజ్ లో రొమాన్స్ చేసిందా..? చూస్తే ఆశ్చర్యపోతారు!


Biggboss Aswini: బుల్లి తెరపై హ్యయ్యెస్ట్ టీఆర్పీతో ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న రియాల్టీ షో బిగ్ బాస్. ప్రస్తుతం టైం అయిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఏడో సీజన్ కూడా అదే రేంజ్ లో కొనసాగుతోంది. ఈ రియాల్టీ షో పై ఎన్నో విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే తాజా సీజన్ అంతా ఉల్టా పుల్టా అంటూ హోస్ట్ నాగార్జున మొదటి నుంచి చెప్పుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం ? ట్విస్ట్ ఇస్తాడో అని జనాలు కూడా ఉత్కంఠతో ఉన్నారు. ఇటీవలే సీరియల్ బ్యాచ్ తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త మోఖాలని కూడా హౌస్ లోకి తీసుకువచ్చారు. అందులో బిగ్ బాస్ అశ్విని ఒకరు.

బిగ్ బాస్ సీజన్ 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదవ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించింది. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అశ్వినికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అశ్విని చాలా సినిమాల్లో నటించినా మహేష్ బాబు సినిమాలో చేసిన పాత్రతోనే ఆమెకు కాస్త గుర్తింపు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

మరి అశ్విని నటించిన మహేష్ బాబు సినిమా ఏది అంటూ ఆలోచిస్తున్నారా ? మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో రష్మిక రెండో అక్క పాత్రను పోషించింది. అశ్విని రైలు సన్నివేశంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న.. అశ్విని సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచూ తన హాట్ ఫోటో షూట్‌ల వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ హాట్ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ అవకాశం దక్కించుకుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా హౌస్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది.

Exit mobile version