Chiranjeevi : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. మొదటి రోజు నుండి నేటి వరకు ఈ సినిమాకి సంబంధించిన వసూళ్ల సునామి ఏమాత్రం కూడా తగ్గలేదు. మొదటి పది రోజులకు గాను ఈ చిత్రానికి సుమంగా 800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, అతి త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోనుంది. ఇది ఇలా ఉండగా ఏ సినిమా మహాభారతం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సంగతి మన అందరికీ తెలిసిందే.
కర్ణుడి పాత్రలో ప్రభాస్, అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ, అశ్వథామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించారు. కల్కి రెండవ భాగం లో మిగిలిన మహాభారతం క్యారెక్టర్స్ కూడా కనిపించనున్నాయి. ఇది ఇలా ఉండగా కల్కి చిత్రాన్ని చూసిన ప్రతీ ప్రేక్షకుడు విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత అమితాబ్ బచ్చన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇది కాదు అనలేని నిజం. ఈ చిత్రం లో అశ్వథామ గా ఆయన అంత అద్భుతంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ప్రభాస్ తో ఢీకొడుతూ ఈ వయస్సులో కూడా శభాష్ అనిపించుకున్నాడు.
అయితే ఈ పాత్ర కోసం నాగ అశ్విన్ ముందుగా చాలా మందిని తన మదిలో అనుకున్నాడట. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరంజీవి ఈ పాత్ర చేస్తే చరిత్రలో నిలిచిపోతుంది అని నిర్మాత అశ్వినీదత్ తో అన్నాడట నాగ అశ్విన్. కానీ చిరంజీవి ఇప్పటికీ కమర్షియల్ హీరో గా కొనసాగుతున్నాడు. ఆయన్ని ముసలి వాడి క్యారక్టర్ లో చూపిస్తే అభిమానులు తీసుకోలేరు, అప్పుడు మొదటికే మోసం వస్తుంది అనే భయం తో అశ్వినీదత్ నిరాకరించాడట.
ఒకవేళ ఈ పాత్ర చెయ్యమని నాగ అశ్విన్ చిరంజీవి ని కోరి ఉంటే ఆయన కచ్చితంగా చేసేవాడేమో. ఇప్పుడు కల్కి చిత్రానికి ఆ పాత్ర వెనుముక లాగ మారింది. చిరంజీవి చేసి ఉంటే కలెక్షన్స్ సునామి ఉదృత ఇంకా తీవ్రవతంగా ఉండేదని ట్రేడ్ పండితులు చెప్తున్నా మాట. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే భారీ బడ్జెట్ చిత్రం లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.