తన మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్(Uday kiran) క్రియేటివ్ డైరెక్టర్ తేజ తన మొదటి సినిమా చిత్రం ని ఉదయ్ కిరణ్ తో తీశారు.చిత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో వీరి కలయిక రెండవ గా నువ్వు నేను వచ్చి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.వరుస హిట్ల తో ఉన్నా ఉదయ్ కిరణ్ కి తన మూడవ సినిమా మనసంతా నువ్వే తో ఇక ఇండస్ట్రీ లో టాప్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు.హ్యాట్రిక్ హిట్స్ సాధించి చాక్లెట్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5 న చనిపోయిన విషయం తెలిసిందే.ఉదయ్ కిరణ్ చనిపోయి 10 సంవత్సరాలు అవుతున్న ఆయన మరణం వెనుకున్న మిస్టరీ మాత్రం అంతుచిక్కడం లేదు.
2000 వ సంవత్సరం లో చిత్రం మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ హిట్ల తో టాలీవుడ్ లో టాప్ హీరో గా మారిపోయారు.ఇక అదే సమయం లో తన జీవితం లో మర్చిపోలేని సంఘటన చోటుచేసుకుంది.మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పెద్ద అమ్మాయి సుస్మిత(Susmitha) ఉదయ్ కిరణ్ ని ఇష్టపడటం తో వారి ఇద్దరికీ 2003 లో నిచ్చితార్ధం కూడా చేసారు.తర్వాత కొన్ని కారణాల వలన ఉదయ్ కిరణ్ ,సుస్మిత ల పెళ్లి కాన్సల్ అయింది.అప్పటి వరకు సూపర్ హిట్ ల తో బిజీ గా ఉన్నా ఉదయ్ కిరణ్ ఒక్కసారిగా డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు.
2005 లో రిలీజ్ అయినా అవునన్నాకాదన్న(Avunanna Kaadanna) మినహాయించి మిగిలిన సినిమా లు అన్ని నిరాశ పరిచాయి.తెలుగు లో అవకాశాలు తగ్గడం తో తమిళ్ లో సినిమా లు చేయడం స్టార్ట్ చేసారు అక్కడ కూడా సరైన సక్సెస్ రాకపోవడం తో మరల తెలుగు వైపే వచ్చారు.అప్పట్లో స్టార్ హీరో గా పేరు తెచ్చుకుని ఇప్పుడు అవకాశాల కోసం అందరి చుట్టూ తిరగడం ఇష్టం లేక చాల సార్లు తన స్నేహితుల దగ్గర భాధపడేవారు అంట.ఇక సినిమా ల నుంచి తప్పుకుని జీవితాన్ని గడపాలి అనుకుని విషిత(vishitha) ని 2012 లో వివాహం చేసుకున్నారు.
సినిమా ల లో అవకాశాలు తగ్గడం,ఫ్యామిలీ లైఫ్ లో ఎదురైనా అవమానాలు ఉదయ్ కిరణ్ ని మానసికంగా కృంగిపోయేలా చేశాయి.తిరుగులేని స్టార్ డాం మరియు సక్సెస్ ని చుసిన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5 న హైదరాబాద్ లోని తన నివాసం లో ఆత్మహత్య చేసుకున్నారు..
అయితే ఉదయ్ కిరణ్ అలా చేసుకోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్పటికి మిస్టరీ గా ఉంది
ఇక ఇదే విషయాన్నీ తన మొదటి సినిమా డైరెక్టర్ తేజ(Teja) తన అహింస మూవీ ప్రమోషన్ ల లో ఉదయ్ కిరణ్ చనిపోవడనికి గల కారణాలు యావత్ సినీ ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాష్ట్ర ల లో ఉన్నా వారందరికీ తెలుసు కానీ ఎవరు కూడా ఆ విషయం గురించి మాట్లాడారు.కొందరికి తెలిసి కూడా నన్నే మాట్లాడతామంటారు అని తన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.