Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Pawan -Balaya: పవన్ కళ్యాణ్ కోసం బాలకృష్ణ అన్ని సినిమా లు వదుకున్నాడా?

pk balaya

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పని లేదు మొదటగా చిరంజీవి గారి తమ్ముడు గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన అతి తక్కువ కాలం లో నే తన కంటే స్టార్ ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తో చిరంజీవి గారు కూడా జెలస్ ఫీల్ అయ్యే లా ఉన్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు..పవన్ కళ్యాణ్ లానే సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన బాలయ్య గారు మొదట తన తండ్రి గారితో కలిసి చేసినప్పటికీ ఆ తర్వాత సోలో హీరో గా అడుగు పెట్టి టాలీవుడ్ లో టాప్ హీరో గా ఎదిగారు.చిరంజీవి ,బాలయ్య బాబు గారికి ఉన్న రేలషన్ గురించి అందరికి తెలిసినప్పటికీ ఈ మధ్య జరిగిన బాలయ్య షో తో పవన్ కళ్యాణ్ గారితో కూడా మంచి రేలషన్ ఉంది అని తెలిసింది.

పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం(Suswagatham) సినిమా ఓపెనింగ్ లో గెస్ట్ గా హాజరు అయినా బాలయ్య బాబు అప్పుడపుడు చిరంజీవి గారి ఇంట్లో జరిగే ఫంక్షన్ ల లో పవన్ కళ్యాణ్ గారితో తనకి పరిచయం ఉంది అని తెలియాచేసారు.పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ హీరో కూడా చేయని త్యాగం బాలయ్య చేసాడు అని ఈ మధ్య ఒక వార్త బయటకు వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ కోసం   బాలయ్య(Balakrishna) చేసిన ఆ త్యాగం ఏంటి.దాని వలన పవన్ కళ్యాణ్ గారికి బెనిఫిట్ అయిందా లేదా అనేది చూద్దాం..

పవన్ కళ్యాణ్ ,భీమినేని శ్రీనివాస రావు కాంబినేషన్ లో 2006 లో అన్నవరం(Annavaram)  మూవీ ని మొదట బాలకృష్ణ గారి తో చేయాలి అని ప్లాన్ చేసారు అంట.అయితే అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సిస్టర్ సెంటిమెంట్ తో రాఖి మూవీ చేస్తుండటం తో ఆయన రిజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ స్క్రిప్ట్ ని రికమెండ్ చేసారు.ఇక అలానే పవన్ కళ్యాణ్ గారి రీ ఎంట్రీ తర్వాత చేసిన బ్లాక్ బస్టర్ ‘బీమ్లా నాయక్'(Bhemla nayak) సినిమా ని మొదట గా నిర్మాతలు బాలయ్య కి వినిపించారు.ఆ స్టోరీ తన కంటే పవన్ కళ్యాణ్ కి బాగుటుంది అని చెప్పడం తో పవన్ కళ్యాణ్ గారు చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.అయితే ఇక్కడ బాలయ్య గారు పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన రెండు సినిమా లు రీమేక్ లు కావడం విశేషం.

Exit mobile version