పెద్దాపురం నియోజక వర్గ వైసీపీ అభ్యర్థిగా మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, నియోజక వర్గ వైసీపీ ఇంచార్జి దవులూరి దొరబాబు ను పార్టీ ఖరారు చేస్తూ ప్రకటించింది. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ దొరబాబు పేరును ప్రకటించారు. దానితో ఆ సమయంలో అక్కడే ఉన్న దొరబాబు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సామర్లకోట లో జరిగిన సీఎం సభలో సీఎం జగన్ దొరబాబు పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. తదనంతరం ఆయన టికెట్ ఖారారు పై ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు పలు వ్యాఖ్యలు చేస్తూ రాగా అది నియోజక వర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే టికెట్టు అధికారికంగా ప్రకటించక ముందు నుంచే దొరబాబు నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారన్ని ముమ్మరం చేశారు. కాగా దొరబాబు కు ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడంతో నియోజక వర్గ వైసీపీ క్యాడర్ అంతా సంభరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి దొరబాబు నియోజక వర్గ పరిధిలోని వాలంటీర్లు, నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చెయ్యగా వారంతా ఎమ్మెల్యే అభ్యర్థి దొరబాబును ఘనంగా అభినందించారు.