Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Devara: ‘దేవర’ నుంచి సూపర్ అప్డేట్.. ఇక కాచుకోండి..

Devara: ‘దేవర’ నుంచి సూపర్ అప్డేట్.. ఇక కాచుకోండి..

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR)బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇందులో మల్టీస్టార్లు నటించారు. ఒకరు రామ్ చరన్ కాగా.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్లి ఓ అవార్డును తెచ్చుకున్న విషయం తెలిసిందే. దీంతో జూనియర్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లోకి పెరిగింది. దీంతో వెంటనే ఆయన మరో మూవీ కొరటాల శిశతో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్(NTR) 30వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే ఖరారు చేయడంతో ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నారు. ఇక ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఆసక్తిని రేపుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘దేవర’( Devara )కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ భారీ కత్తిని పట్టుకొని సముద్రపు అంచున ఎమోషన్ తో చూస్తున్నాడు.

దీనిని భట్టి చూస్తే ఇది మాస్ ఎమోషనల్ మూవీ అని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఆ రేంజ్ లో లుక్ ఇవ్వడంతో సినిమాపై హోప్స్ విపరీతంగా పెరిగాయి. ఈ మూవీలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఆదిపురుష్ తో తన నటబీభత్సాన్ని చూపించాడు. ఆదిపురుష్ తరువాత ఆయన నటిస్తున్న ఈ మూవీలో గెటప్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో దేవర నుంచి కొత్త అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో మరో స్టార్ నటుడు షైన్ టామ్ చాకో ( Shine tom chacko )నటిస్తున్నాడు. నాని హీరోగా వచ్చిన ‘దసరా’లో టామ్ విలన్ గా నటించి ఆకట్టుకున్నాడు. దీంతో ఆయన దేవర సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే టామ్ కు దేవర సినిమాలో విలన్ గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఆ ప్లేసును భర్తీ చేశారు. మరి ఈయనకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనని అందరూ అనుకుంటున్నారు.

టామ్ మరో మూవీ రంగబలిలో నటిస్తున్నాడు. ఇలా మెల్లగా తెలుగులో అవకాశాలు చేజిక్కించుకుంటున్నాడు. ఎన్టీఆర్ సినిమా తరువాత టామ్ కు మరిన్ని అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. అయితే ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలా ఉండగా దేవర ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో హీరోయిన్ గా జాహ్నవి నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version