VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Sai Tej: క్రేజీ డైరెక్టర్ తో పూజ హెగ్డే ,సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ.

మెగా ఫ్యామిలీ లో ఉన్న హీరో ల లో ప్రతి ఒక్కరు కూడా మొదట మెగా టాగ్ వేసుకుని ఇండస్ట్రీ లో కి అడుగు పెట్టినప్పటికీ ఆ తర్వాత వారికి ఉన్న టాలెంట్ ని బేస్ చేసుకుని తమ కెరీర్ లో
ఉన్నత స్థాయి కి ఎదిగారు.అయితే మెగా మెగా ఫ్యామిలీ హీరో ల కి ఎంత అయితే క్రేజీ మరియు మార్కెట్ ఉంటుందో వారితో పని చేసిన హీరోయిన్ ల కు కూడా అంతే స్థాయి లో గుర్తింపు తో పాటు గా అవకాశాలు వస్తాయి.అయితే కొంత మంది హీరోయిన్ లు వేరే హీరో ల తో చేసి సరైన సక్సెస్ లు లేనపుడు మెగా హీరో ల తో అవకాశాలు వచ్చినప్పుడు అసలు వదులుకోరు దానికి కారణం వారితో నటిస్తే పక్కాగా హిట్ తో పాటు మంచి గుర్తింపు వస్తుంది అనే భావన ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు అదే అవకాశాన్ని పూజ హెగ్డే(Pooja hegde) అందుకోనున్నారు.

acharya

ముకుంద,దువ్వాడ జగన్నాధం,గడ్డలకొండ గణేష్,రంగస్థలం,అలా వైకుంఠ పురములో వంటి సినిమా ల తో పాటు ఆచార్య లో కనిపించి మెగా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజ హెగ్డే ఇప్పుడు తెలుగు లో సరైన అవకాశాలు లేక ఒక వేళా అవకాశాలు ఉన్న సరైన సక్సెస్ లేక హిందీ లో సర్కస్ , కిసి కి భాయ్ కిసి కా జాన్ ల తో చేసి ఐరన్ లెగ్ గా మారారు,ఇక తెలుగు లో రీసెంట్ గా త్రివిక్రమ్ ,మహేష్ బాబు గుంటూరు కారం(Guntur kaaram) నుంచి తప్పుకున్న పూజ హెగ్డే కి మన తెలుగు లో ఒక్క సినిమా కూడా లేదు ప్రస్తుతం.

గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న పూజ హెగ్డే కి తెలుగు లో గోల్డెన్ ఛాన్స్ దక్కింది అనే చెప్పాలి మెగా ఫ్యామిలీ నుంచి ఆమె చేయాలి సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ తో కొత్త సినిమా లో హీరోయిన్ గా పూజ హెగ్డే ని ఎంపిక చేసినట్లు సమాచారం.ఈ సినిమా ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు తీస్తుండగా కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నంది(sampath nandi) డైరెక్షన్ చేయనున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ వంటి బ్లాక్ బస్టర్ చేసిన సంపత్ ఆ తర్వాత బెంగాల్ టైగర్ ,గౌతమ్ నంద ,సిటిమార్ వంటి సినిమా ల తో కమర్షియల్ సినిమా ల కి కేర్ అఫ్ అడ్రస్ గా అయ్యారు.ఇక ఇప్పుడు సాయి తేజ్(Sai tej) ,పూజ హెగ్డే కలయిక లో రాబోతున్న ఈ సినిమా ని పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version