Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Comedian Sunil: రాజకీయాల్లోకి కమెడియన్ సునీల్ ఎంట్రీ..ఏ పార్టీ లోకి వెళ్తున్నాడంటే!

Comedian Sunil: సినీ తారలు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణం అయిపోతుంది. కానీ సినీ తారలు రాజకీయాల్లో సక్సెస్ అవ్వగలరు అనేది ఎన్టీఆర్ కాలం నాటి మాట, కానీ నేటి తరం లో నడుస్తున్న ఖరీదైన పొలిటికల్ ట్రెండ్ లో ఒక సినీ హీరో సక్సెస్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు. కేవలం ఒక్క ఎన్నిక కోసం సినీ కెరీర్ మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బులను ఖర్చు చేయాలి. అలా చేస్తే కనీసం డబుల్ డిజిట్ ఓటు షేర్ వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా?, రీసెంట్ గానే తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) రాజకీయాల్లోకి TVK అనే పార్టీని స్థాపించి అడుగుపెట్టాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయబోతున్నాడు. గెలుస్తాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎన్నికల రణరంగంలోకి దూకే ముందు ఆయన ‘జన నాయగన్'(Jana Nayagan) అనే చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు.

షూటింగ్ కార్యక్రమాలు చకచకా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తన సిద్ధాంతాలను ఈ సినిమా ద్వారా జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే యూత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవచ్చు అనేది విజయ్ ఆలోచన. అయితే ఇప్పుడు విజయ్ కి పోటీగా మరో నటుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు. అతను మరెవరో కాదు, మన కమెడియన్ సునీల్. తెలుగువాడైన సునీల్(Comedian Sunil) కి తమిళ రాజకీయాలు ఎందుకు అని అనుకోని కంగారు పడుతున్నారా?, అంత దూరం ఆలోచించకండి. ఇది కేవలం సినిమాలో మాత్రమే. ‘జన నాయగన్’ చిత్రం లో ప్రతిపక్ష నేత గా సునీల్ నటించబోతున్నాడు. విజయ్ తో ఢీ అంటే ఢీ అనే రేంజ్ సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయట. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా తెలియనుంది.

కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో స్టార్ కమెడియన్ గా ఎదిగిన సునీల్. ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు.ఇప్పుడు ఆయన విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా సౌత్ లో అందరి హీరోల సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా మారిపోయాడు. ముఖ్యంగా సునీల్ కి ఈమధ్యకాలం లో తెలుగులో కంటే తమిళం లో ఎక్కువ సినిమాలు రావడం విశేషం. రీసెంట్ గానే అజిత్ హీరో గా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం లో అజిత్ కి అసిస్టెంట్ గా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు మరో సూపర్ స్టార్ విజయ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కూడా కచ్చితంగా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version