Rohan: టాలీవుడ్ లో టాలెంట్ కు కొదవలేదు ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కొత్త జనరేషన్ కూడా తమ టాలెంట్ తో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్షన్ డిపార్ట్మెంట్ వరకు తమదైన శైలిలో యంగ్ టాలెంట్ దూసుకుపోతుంది. ఒకప్పుడు మూవీస్ లో, అలీ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చి ఈరోజు ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిందే అలాగే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది వచ్చారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి హీరోగా సెటిల్ అయినా తేజ కూడా అలానే వచ్చినవాడే, ఇప్పుడు అలానే ఫ్యామిలీ వెబ్ సిరీస్ లో తన నటన విశ్వరూపాన్ని చూపించి సినిమా విజయంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించాడు రోహన్ రాయ్.
మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ 90 బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి వెబ్ సిరీస్. ఈ సిరి శివాజీ ముఖ్య నటుడిగా చేశారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ లో వాళ్ళు పడే కష్టాలను ఇందులో చూపిస్తారు ఇక అదే వెబ్ సిరీస్ లో రోహన్ రాయ్, స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేని ఇంట్లో చదువు రాక ఇబ్బంది పడుతున్న ఒక పాత్రలో నటించి అందరినీ మెప్పించి తమ పాత రోజులు ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేలా చేశాడు. ఈ సిరీస్ లొ రోహన్ రాయ్ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో అందరినోళ్లలో నానుతుంది. ఇక అవకాశాలు కూడా రోహన్ రాయిని అలానే క్యూ కడుతున్నాయని చెప్పచ్చు.
అదృష్టం బాగుంది, వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చి తన టాలెంట్ ని చూపించినంత మాత్రాన మనం డిమాండ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అన్నది రోహన్ రాయ్ మరిచినట్టు ఉన్నాడు. చేసింది ఒక సిరీస్ కొట్టింది ఒక హిట్ అయినా కూడా ఇప్పుడు రోహన్ రాయికి వచ్చే అవకాశాలను తన చేతులారా వదులుకుంటాడేమో అనిపిస్తుంది. అందుకు కారణం అతను తన పారితోషకాన్ని అమాంతం పెంచేయడం, ఒక వెబ్ సిరీస్ చేయగానే, డిమాండ్ గా కోటి రూపాయలు వసూలు చేయాలని చూస్తున్నాడంటే ఇక ఆశ అత్యాశ చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎంతో కష్టపడితే కానీ కోటి రూపాయలు పారితోషకం తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న కొంత మంది ఆర్టిస్టులు కోటి రూపాయలు పారితోషకం తీసుకోకుండా చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది రోహన్ రాయ్ సీరియల్స్ కి సినిమాలకి కోటి రూపాయలు పారితోషకం తో డిమాండ్ చేస్తున్నాడు అంటే, ఇక తన కెరీర్ మీద తను ఎలా దృష్టి పెట్టాడో ఆలోచించాల్సిందే.