కరోనా వచ్చినప్పటి నుంచి వయసు తో పని లేకుండా చాల మంది ఈ లోకం విడిచి వెళ్లారు ,సామాన్యులు ఎంత మంది చనిపోయారు ,అదే విధముగా సెలెబ్రెటీ లు కూడా చనిపోయారు,అయితే కరోనా కొంచెం తగ్గు మొకం పట్టిన అప్పటి నుంచి ‘హార్ట్ ఎటాక్ ‘ తో చాల మంది మరణించారు ,అందులో సినిమా వాళ్ళు ,రాజకీయనాయకులు చిన్న వయసు లో నే చనిపోయారు,ఎప్పుడు ఏమి వస్తుందో తెలియాని పరిస్థితు ల లో ఉన్నాం.ఇప్పుడు మరో సెలెబ్రెటీ గుండె పోటు కి గురి అవ్వడం అందర్నీ కలవర పెడుతుంది. అయన ఎవరో కాదు ‘చలాకి చంటి’.
జబర్దస్త్ షోలో కామెడీ చేసి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చంటి. బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా మంచి పాత్రల్లో అతడు నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంటికి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. తీవ్ర అస్వస్థతకు గురయిన చంటిని ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చంటికి డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి పాపులారిటీ సంపాందించిన చంటి.. ఆ తర్వాతి కాలంలో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఆపై జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా చాలాకాలం పాటు రాణించాడు. అక్కడైన తనదైన కామెడీ టైమింగ్, పంచ్‌లతో అలరించాడు. జబర్ధస్త్ షో చేస్తూనే సినిమాల్లో కూడా నటించాడు. ఈటీవీ ప్లస్‌లో నా షో నా ఇష్టం షోకు హోస్ట్‌గా చేశాడు. ఈ కార్యక్రమం చాలాకాలం కొనసాగింది.ఎప్పుడు తన చలాకీతనంతో అందరినీ నవ్వించే చంటి ఇలా చిన్న వయస్సులో గుండెపోటుకు గురయ్యాడని తెలియడంతో, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.