రాజానగరం టీడీపీ కార్యాలయంలో అంబరాన్నంటిన సంబరాలు
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (RUDA) చైర్మన్, రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి & రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాజానగరంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు.
మంగళవారం రాజానగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ జై జై నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. మందు గుండు సామాగ్రితో చేసిన సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ—శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా సమిష్టిగా కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.