Nagarjuna: బుల్లి తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని భాషల్లోనూ ఈ షో హయ్యస్ట్ టీఆర్పీతో దూసుకుపోతుంది. తెలుగు భాషలో బిగ్ బాస్ వచ్చి దాదాపు ఏడేళ్లు అవుతోంది. ఫస్ట్ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. తరువాత రెండో సీజన్ కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. వీరిద్దరూ కేవలం ఒక్కో సీజన్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత సీజన్ నుంచి అక్కినేని నాగార్జున ఏకధాటిగా అన్ని సీజన్లకు హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు. తాజా సీజన్ కు ఆయన గుడ్ బై చెప్పేస్తారన్న టాక్ వచ్చింది. అలాగే.. కొత్త సీజన్లకు వచ్చే ప్రతీసారి కొత్త హోస్ట్ వచ్చేస్తారంటూ వార్తలు వచ్చేవి. కానీ అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ నాగార్జునే కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం సీజన్-7ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.
వాస్తవానికి ఏదైనా ప్రోగ్రాంకు హోస్టుగా వ్యవహరించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కాస్తంత ఛాలెంజింగ్ విషయమే. ‘బిగ్ బాస్’ వంటి రియాలిటీ షోస్‌కు హోస్ట్‌గా వ్యవహరించడం మాత్రం ఈజీ కాదు. అందులో ఒక్కరిద్దరు కంటెస్టెంట్స్ ఉండదు. పదుల సంఖ్యలో ఉన్న వాళ్లందరినీ జడ్జ్ చేయడమంటే కత్తిమీద సాము లాంటిదే. వారి తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ సరైన నిర్ణయాన్ని ప్రకటించాలి. ఎప్పటికప్పుడు హౌస్ కంట్రోల్ తప్పకుండా కంటెస్టెంట్లను లైన్లో పెట్టాలి. వారు చేసే తప్పులన్నింటినీ పరిశీలించాలి. ఎవరికీ సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉండాలి. నాగార్జున అలా చేస్తున్నారు కాబట్టే ఇన్నేళ్లుగా హోస్టుగా రాణిస్తున్నారు. ప్రేక్షకులు కూడా నాగార్జున హోస్టింగ్ సరైనదేనన్న అభిప్రాయాన్ని వెళ్లడిస్తున్నారు.
అయితే, బిగ్ బాస్ షో ప్రతి ఎపిసోడ్ ను నాగార్జున చూస్తారా.. లేదా ‘బిగ్ బాస్’ టీం చెప్పేది విని వాళ్లు రెడీ చేసే స్క్రిప్ట్ చదువుతారన్న అనుమానం చాలా మందిలో ఉంది. ఈ సందేహాలపై నాగార్జున ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘బిగ్ బాస్’ హోస్టింగ్ అంటే మాటలు కాదని, అది తనకు పెద్ద సవాల్ అని నాగార్జున పేర్కొన్నాడు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘మీలో ఎవరు కోటేశ్వరుడు.. వంటి షోలలో మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే. మనం వేసిన ప్రశ్నలకు ఎదుటి వారు చెప్పే సమాధానం కరెక్టా కాదా అనేది మన ముఖంలో కనిపించకుండా జాగ్రత్తపడాలి. కానీ, ‘బిగ్ బాస్’లో అలా కాదు. ప్రతి ఒక్కటీ నోటీసు చేయాలి. మరీ ముఖ్యంగా ఆ కంటెస్టెంట్ చెబుతున్నది కరెక్టేనా?.. లేదా నాతో ఆడుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి. వారం మొత్తం మొత్తం బిగ్ బాస్‌ను ఫాలో కాకపోతే.. హోస్టింగ్ చేయడం చాలా కష్టమవుతోంది. అందుకే, ఉదయాన్నే నేను ‘హాట్ స్టార్’ ఆన్ చేసి అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటాను. అలాగే రాత్రి ఏం జరిగిందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. అంతే కాకుండా ప్రేక్షకులు చూడనివి కూడా చూస్తాను. చాలా విషయాలు ప్రేక్షకులకు చూపించరు. కానీ బిగ్ బాస్ టీమ్ హైలెట్స్ అన్నీ కట్ చేసి నాకు ప్రత్యేకంగా పంపుతారు. హోస్టింగ్‌కు ముందు ఆ హైలెట్స్ అన్నీ వెనక్కి వెళ్లి చూస్తాను’’ అని తెలిపారు.