Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Big Boss 7 Telugu : బిగ్ బాస్ 7 ఈ వారం ఎలిమినేషన్ లో భారీ ట్విస్ట్..ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై మూడు వారాలవుతోంది. సీజన్ స్టార్టింగ్లో హోస్ట్ నాగార్జున ఈ సారి అంతా ఉల్టా ఫల్టా అని ప్రకటించారు. అన్నట్లే రెండు వారాలు బాగానే కొనసాగింది. కానీ రాను రాను సీజన్ లో మజా లేకుండా పోతుంది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ చూస్తే సీజన్ చూడాలన్న కోరిక చచ్చిపోతుంది. ఈ మూడో వారం నామినేషన్స్ చప్పగా సాగాయి. అసలు అది బిగ్ బాస్ హౌసా లేక.. ? ఇదో హోటలా అన్నట్లు ప్రవర్తించారు హౌస్ మేట్స్. వాళ్లు ఇతరులను నామినేట్ చేసిన రీజన్స్ అలా ఉన్నాయి మరి. రూం బాలేదు.. ఫుడ్ బాలేదు.. వాటర్ ఇవ్వలేదు.. గిన్నెలు కడగలేదు.. లాంటి పనికి మాలిన కారణాలు చెప్పి తమ హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు. ఏ ఒక్కరూ సరైన కారణం చెప్పింది లేదు. అందిలో గౌతమ్ కాస్త ఫర్వాలేదనించాడు. మిగిలిన వాళ్లంతా సొల్లు రీజన్స్‌ చెప్పి నామినేషన్స్ మమ అనిపించారు. ఈ వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. వారిలో దామిని, శుభశ్రీ, రతిక, యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్ ఉన్నారు.

ఈ ఏడుగురు మూడో వారం ఓటింగ్‌లో పోటీ పడుతున్నారు. సోమవారం రాత్రి నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా అమర్ దీప్ అత్యధిక ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. నటుడు శివాజీ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, డ్యాన్స్ మాస్టర్ ఆట సందీప్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఓటింగ్‌లో లేరు.దీంతో అమర్ దీప్ టాప్ ప్లేస్ లోకి వచ్చేశాడు. వాస్తవానికి అమర్ దీప్ మూడో వారం నామినేషన్లలతో లేడు కానీ అతడిని పవరాస్త్ర ద్వారా బిగ్ బాస్ నామినేషన్లలోకి పంపారు. కారణం ఆడియన్స్ నుంచి ఓట్లు దండిగా పడాలంటే.టాప్ కంటెస్టెంట్ ఎవరో ఒకరు నామినేషన్స్‌లో తప్పకుండా ఉండాల్సిందే. లేకపోతే ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. అందుకే బిగ్ బాస్ ఈ ఎత్తుగడ వేశారు. మామూలు వాళ్లు నామినేషన్లలో ఉండే ఎవడు పోతే ఏంలే అనుకుంటారు జనాలు. అందుకు ఓట్ల రాజకీయాలకు తెరలేపారు బిగ్ బాస్. అలా ఈవారం తన చాకచక్యంతో బిగ్ బాస్ అమర్ దీప్‌ని నామినేషన్స్‌లో పెట్టారు. నిజానికి అమర్ దీప్‌కి బయట బలమైన పీఆర్ టీం ఉందరి తెలుస్తోంది. దీంతో అతడికి ఈ వారం టాప్‌లో ఉన్నాడు. ఇప్పటికే అమర్ దీప్ కి 21 శాతం ఓట్లు పడుతున్నాయి.

అమర్ తర్వాత స్థానంలో ప్రిన్స్ 19 శాతం ఓట్లను సంపాదించుకుంటున్నాడు. వాస్తవానికి ప్రిన్స్ ఎవరనేది ఇప్పటి వరకు మన తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం లేకపోయినా చిన్న పిల్లాడి మనస్తత్వంతో మనవాళ్లను ఆకట్టుకుంటున్నాడు. గత వారం.. గౌతమ్‌తో గొడవ కారణంగా ప్రిన్స్‌ పట్ల జనాల్లో సింపథీ పెరిగింది. గౌతమ్ అతనికి తెలుగు రాదని టార్గెట్ చేయడం జనాలకు నచ్చలేదు. దీంతో సింపథీలో ఓట్లు తెగ వేసేస్తున్నారు. వీరి తర్వాత 17శాతం ఓట్లతో ప్రియాంక మూడో స్థానంలో ఉండగా.. గౌతమ్ కృష్ణ 16 శాతం ఓట్లతో నాలుగో స్థానం, 14 శాతం ఓట్లతో రతిక ఐదో స్థానం, 8శాతం ఓట్లతో శుభ శ్రీ ఆరో స్థానంలో ఉంది. బిగ్ బాస్ వంటలక్క దామిని 5 శాతం ఓట్లతో అందరికంటే తక్కువ స్థానంలో ఉంది. ఇదే కొనసాగితో మూడో వారంలో వంటలక్క బ్యాగ్ సర్దేయడం ఖాయంగా అనిపిస్తోంది. ఆమె తర్వాత శుభ శ్రీ కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో హౌస్‌లో నుంచి పోతే వీరిద్దరిలో ఒకరు బయటకు పోవడం గ్యారంటీ.

Exit mobile version