రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం భారీ కేక్ కట్ సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులూ పాల్గొన్నారు.