Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Ankita Lokhande: సౌతిండియా సినిమాల్లో నటించాలంటే.. వాళ్ల పక్కలో పడుకోవాల్సిందే


Ankita Lokhande: అంకిత లోఖండే.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అని చెప్పండి.. ఓ ఆమెనా పవిత్ర రిష్తా సీరియల్ నటి కదా అని చెప్పేస్తారు. అవును ఆమెనే అంకితా లోఖండే. సుశాంత్ మరణం తర్వాత ఆమె పేరు బాగా పాపులర్ అయింది. సుశాంత్‌తో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న అంకిత విడిపోయి విక్కీ జైన్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హిందీ బిగ్ బాస్ 17వ సీజన్‌లో ఈ జంట సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలు.. వాళ్ల ఫ్యామిలీ బయట చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఎలాగైతేనేం టాప్ 5 లో అంకిత నిలిచింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అంకిత.. తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వివరించింది.

‘అప్పుడు నాకు 19 సంవత్సరాలు.. అప్పుడప్పుడే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక సౌత్ సినిమాకు ఆడిషన్ కు వెళ్లాను. తరువాత ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీరు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని చెప్పారు. దాంతో ఆనందంలో ఎగిరి గంతేశాను. నాకు హీరోయిన్ ఆఫర్ వచ్చిందని మా అమ్మకు కూడా చెప్పాను. ఇక వెంటనే.. వారి ఆఫీస్ కు వెళ్లాను. అక్కడకు వెళ్ళాకా.. నాతో పాటు వచ్చిన వ్యక్తిని బయటే ఉంచి లోపలికి రమ్మన్నారు. సరే అని నేను లోపలికి వెళ్లాను. నాతో మాట్లాడిన అతను.. హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. అయితే మీరు కాంప్రమైజ్ కావాలన్నారు. ఆయన నాకు ఏం చెప్తున్నారో అర్ధం కాలేదు. 19 ఏళ్ల నేను.. కాంప్రమైజ్ మాటను అప్పుడే విన్నాను. అంతే అమాయకంగా కాంప్రమైజ్ అంటే ఏంటి అని అడిగాను. మీరు నిర్మాతతో ఒక రాత్రి పడుకోవాలన్నాడు. నాకు అసలు ఏం అర్ధం కాలేదు. మీ నిర్మాతకు టాలెంట్‌ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి వచ్చేశాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version