Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Racha Ravi : స్టేజ్ పైనే రచ్చ రవిని బండబూతులు తిట్టిన యాంకర్


Racha Ravi : ఒక్కోసారి సినిమాలకు సంబంధించిన వేడుకల్లో ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. ‘అంతా బాగానే జరుగుతుంది కదా’ అనుకున్న టైంలో వేదికపై ఉన్నవాళ్లలో ఎవరొకరు బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం, అందువల్ల వాళ్లు విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం తరచూ జరుగుతున్నాయి. ఈమధ్య టాలీవుడ్ మూవీ ఈవెంట్స్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, అసభ్యకర మాటలు ఎక్కువ వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమా టీజర్ లాంచ్ ఇటీవల హైదరాబాద్లో చాలా ఘనంగా జరిగింది.

ఈ సినిమా ఈవెంట్ లో రచ్చ రవి చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఈవెంట్ కి గీతా భగత్ యాంకర్ గా వ్యవహరించారు. స్టేజి పై రచ్చ రవి మాట్లాడుతూ.. డబుల్ మీనింగ్ డైలాగ్‌ వదిలారు. దానికి యాంకర్ కూడా కొంచెం సీరియస్ అవుతూ.. రచ్చ రవికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే, యాంకర్ గీతా భగత్ తో రచ్చ రవి మాట్లాడుతూ.. “ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది” అంటూ కామెంట్ చేశారు. దానికి గీతా షాక్ అయ్యారు. అయితే మాటల్లో కొంచెం గ్యాప్ ఇచ్చిన రవి.. ‘నీ మనసు మాయమయ్యి నా దగ్గరకి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చారు.

కాస్త తేరుకున్న గీతా రియాక్ట్ అవుతూ.. “నువ్వు గ్యాప్ ఇచ్చి మాట్లాడకు. ఓం భీమ్ బుష్ నీది మాయం అయ్యింది. నీ బుర్ర నీ నుంచి మాయం అయ్యింది” అంటూ స్టేజి పైనే సాలిడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ రచ్చ రవిని బండ బూతులు తిడుతున్నారు. ఇక ‘ఓం భీమ్ బుష్’ మూవీ విషయానికి వస్తే.. సూపర్ హిట్ ట్రైయో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘బ్రోచేవారెవరురా’ సినిమా తరువాత మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి ఈ ముగ్గురు సిద్ధమవుతున్నారు. ‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 22న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

Exit mobile version