టాలీవుడ్ లో కొత్త వారి టాలెంట్ ని పరిచయం చేస్తూ తన కంటూ ట్రేడ్ మార్క్ చిత్రాలని చేసే డైరెక్టర్ తేజ(Teja).నితిన్ ,ఉదయ్ కిరణ్ ,నవదీప్,కాజల్ అగర్వాల్ లాంటి వారికి అవకాశాలని ఇచ్చి ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ ఇచ్చిన తేజ.ఆ తర్వాత మరి కొందరు కొత్త వారికి ఛాన్స్ లు ఇస్తూ సినిమా లు చేస్తున్నారు.ఇక కొత్త గా దగ్గుపాటి రానా తమ్ముడు అభిరాం ని పరిచయం చేస్తూ అహింస అనే సినిమా ని చేసారు.సినిమా పేరు లోనే అహింస(Ahimsa) ఉన్నపటికీ రిలీజ్ అయినా ట్రైలర్ లో హింస ని చూపించారు.ఇక ఈ సినిమా తేజ గారికి మరియు కొత్త హీరో అభిరాం కి సక్సెస్ ఇచ్చిందో లేదో చూద్దాం.
కథ :రఘు (అభిరామ్) సమాజం లో అహింస తో మెలగాలి అని అందరితో మంచిగా ఉండే వ్యక్తి అతనికి అహల్య (గీతిక) కజిన్ ఆమె ఎప్పుడు కూడా హింసని ప్రేరేపిస్తూ ఉంటుంది.ఈఇద్దరు భిన్నమైన నమ్మకాలు కలిగిఉంటారు . రఘు అహింసను నమ్ముతాడు, అహల్య హింసను నమ్ముతుంది . ఇలా సాగిపోతూ ఉండగా ఒకరోజు అహల్య కొంత మంది ధనవంతుల చేత అత్యాచారానికి గురి కాబడుతుంది.ఆ తరువాత ఆమె హాస్పిటల్ లో జాయిన్ అవుతుంది.ఇక రఘు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాడు.అక్కడ ఎవరు కూడా తనకి న్యాయం చేయరు
అలా అసహానికి గురిఅయిన తర్వాత రఘు ఏం చేస్తాడు? న్యాయం కోసం హింసను ఎంచుకున్నాడా? ఆ తర్వాత నిందితులు ఏం చేశారు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:కథ పరంగా పాత కథే అయిన్పటికీ తేజ తాను అనుకున్న విధంగా చూపించి సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.ఇక తన మొదటి సినిమా అయినా యాక్టింగ్ లో ఎక్కడ తడపాటు లేకుండా చేసి మంచి మార్కులే కొట్టేసారు అభిరాం.లాయర్ గా సీనియర్ నటి సదా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు.కోర్ట్ లో వచ్చే సీన్ లు సినిమా కి హైలైట్ గా నిలిచాయి.ఇక వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ మ్యూజిక్ బాగుంది.సినిమా కథ పాతది అయినా తేజ మార్క్ తో అలా అలా సాగిపోతుంది.
పాజిటివ్:అభిరాం ,కోర్ట్ సీన్ లు ,సదా.
నెగటివ్ :కథ ,స్క్రీన్ ప్లే ,సెకండ్ హాఫ్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
రేటింగ్:2 .5 / 5