ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ థియేటర్లోసంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా రిలీజై 10 రోజులు గడుస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మరోవైపు సినీ మార్కెట్లో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెల్లిందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆదిపురుష్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. థియేటర్ రిలీజ్ లోరిలీజ్ చేసినప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ దీనిని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా ఓ డేట్ వైరల్ అవుతోది.
జూన్ 16న థియేటర్లో రిలీజ్ అయిన ఆదిపురుష్ ఎన్నో వివాదాలు, విమర్శల మధ్య కొనసాగుతోంది. సినిమాలోని కొన్ని సీన్లు అభ్యంతరకంగా ఉండడంతో వాటిని చిత్రం యూనిట్ కట్ చేసింది కూడా. ఆది పురుష్ సినిమా కోసం రూ.300 నుంచి రూ.400 పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత 10 రోజులకు పెట్టుబడి వచ్చిందని అంటున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే లాభాల పంట పండినట్లేనని అంటున్నారు.
ఇక ఈ మూవీని మొదట్లోనే డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అన్ని రైట్స్ కలుపుకొని రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే సినిమాకు వస్తున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని దీనిని థియేటర్లో రిలీజ్ అయిన 8 వారాల తరువాత ఓటీటీలోకి తీసుకురావాలని నిర్ణయించారు.తాజాగా ఆ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మొదట్లో ఈ మూవీని ఓటీటీలో ఆగస్టు 11న రిలీజ్ చేయాలని భావించారు.
కానీ ఆ సమయంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓటీటీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఈ తేదీ కూడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇంచుమించి ఈ రెండు తేదీల్లోనే కన్ఫామ్గా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 15న రిలీజ్ అయితే ఆడియన్ష్ కు సర్ ఫ్రైజ్ ఇచ్చినట్లే అవుతుంది.
థియేటర్లో రికార్డు బద్దలు కొడుతున్న ఆదిపురుష్ ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు. చాలా మంది థియేటర్లో రావడానికి ఇష్టపడడం లేదు. కొంతమందికి ఓటీటీకే అలవాటుపడిపోయారు. అయితే సినిమాపై వస్తున్న ఆదరణతో ఓటీటీలో కూడా ఎక్కువ శాతం వీక్సించే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడ కూడా సక్సెస్ అయితే ఆదిపురుష్ రికార్డు సాధించినట్లేనని అంటున్నారు.