Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Adipursh: ఆదిపురుష్ మూవీ రివ్యూ !

adipursh review

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయి కి మారింది..తర్వాత రిలీజ్ అయినా సాహూ ,రాధే శ్యామ్ సినిమా లు నిరాశపరిచిన కూడా తన మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు అని నిరూపించింది ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా లో ప్రభాస్ శ్రీ రాముడు గా చేయగా కృతి సనాన్ సీత గా మరియు సైఫ్ అలీఖాన్ రావణ క్యారెక్టర్ ని చేసారు.భారీ బడ్జెట్ తో తెరక్కెనిన ఆదిపురుష్ జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.ఇండియన్ ఎపిక్ స్టోరీ అయినా రామాయణం ని మోడరన్ వే లో ప్రెసెంట్ చేసిన విధానం ఎలా ఉంది.ప్రభాస్ రాముడిగా ఆకట్టుకున్నాడా..సినిమా హిట్ అయిందా లేదా అనేది చూద్దాం.

కథ:ఇండియన్ ఇతిహాసాలలో ప్రాచుర్యం పొందిన రామాయణం మీద ఇప్పటికే చాల సినిమా లు వచ్చాయి.అయితే వాటి కి బిన్నంగా రామాయణం చూపించే ప్రయత్నం చేసారు ఓం..
ధర్మం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని రాఘవుడు(ప్రభాస్) తన ప్రాణ సమానం అయినా జానకి(కృతి సనాన్) ని అపహరించుకుని వెళ్లిన రావణ(సైఫ్ అలీ ఖాన్ ) నుంచి ఎలా తీసుకుని వచ్చాడు అనేది కథ.అయితే ఇందుకోసం శ్రీ రాముడి వెంటనే ఉన్న తన తమ్ముడు లక్ష్ముణుడు తన అపర భక్తుడు అయినా హనుమాన్ రాముడికి ఎలా సహాయము చేసారు ..లంక లో ఉన్న జానకి ని తిరిగి తమ రాజ్యానికి తీసుకుని రావడానికి వానర సైనం చేసిన సహాయం ఎలాంటిది,రాముడికి అంటే గొప్ప బలమైన రావణుడు సీత ని తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:బాహుబలి లో అమరేంద్ర బాహుబలి గా చేసిన ప్రభాస్ ఆదిపురుష్ లో శ్రీ రాముడు గా తన రాజ్యం లో ని ప్రజల కోసం తాను నమ్మిన ధర్మం కోసం నిలబడతాడు.తన వాయిస్ లో గంబీరత్వం ఉట్టిపడుతుంది.జానకి గా కృతి సనాన్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.ఇక సినిమా లో ప్రధాన పాత్రా అయినా హనుమాన్ క్యారెక్టర్ చేసిన దేవదత్త నాగ్ అద్బుతమగా చేసారు.ఇక మ్యూజిక్ డైరెక్టర్ లు అయినా సంచిత బాళ్హరా,అంకిత్ బాళ్హరా ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా కి మేజర్ గా నిలిచాయి.ఆదిపురుష్ ఇది కేవలం విజువల్‌గా రీప్యాకేజింగ్ చేయడమే కాకుండా సెన్సిబిలిటీ వారీగా కూడా ఉంది. ఇది క్లాసిక్ రామాయణం కథ యొక్క సామూహిక, ఆధునిక వెర్షన్. అసలు పాత్రల వక్రీకరణ మరియు కొన్ని పనికిమాలిన VFX ని కొంచెం పక్కన పెడితే ఆదిపురుష్ మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది.


పాజిటివ్:ప్రభాస్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ,ఫస్ట్ హాఫ్
నెగటివ్:సెకండ్ హాఫ్ ,లెంగ్త్.
రేటింగ్: 3 .75 / 5
చివరగా సోషల్ మీడియా ల లో వస్తున్న నెగటివ్ పబ్లిసిటీ ని నమ్మకుండా ఫ్యామిలీ తో కలిసి వెళ్లి సినిమా చూడండీ.జై శ్రీ రామ్.

Exit mobile version