Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

వీరవరం గ్రామంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం వీరవరం గ్రామంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించిన వై.యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గo ఇంఛార్జి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు మరియు కాకినాడ మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ తోట నరసింహం గారు యువనాయకులు తోట శ్రీరాంజీ గారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది. అలా.. 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే.. ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం అని అన్నారు.

Exit mobile version