Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

BJP 1st List: 195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా

BJP: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 34 మంది మంత్రులు.. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు లోక్‌సభ బరిలో నిలిచారు. తొలి జాబితాలో 28 మంది మహిళలు, 50 ఏళ్లలోపు అభ్యర్థులు 47 మంది ఉన్నారు. ఓబీసీ కేటగిరీకి చెందిన 57 మంది చోటు దక్కించుకున్నారు. మొత్తం 195 మందిలో 51 మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, 20 మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు, ఐదుగురు ఢిల్లీకి చెందిన వారు. మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 12 మందిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్‌ నుంచి, కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవియా గుజరాత్‌లోని పోర్‌బందర్‌ నుంచి పోటీ చేయనున్నారు. ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేయనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్‌ గుణ నుంచి లోక్‌సభకు, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు.

Exit mobile version