Tollywood: 2023 టాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్ కానుందా!

Posted by venditeravaartha, July 24, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

మన దేశం లో ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ,క్రికెట్ మాత్రమే,అందులో సినిమా కి ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు.దేశం లో అతి పెద్ద ఇండస్ట్రీ గా బాలీవుడ్ ని చూసేవారు సినిమా బడ్జెట్ ,నటి ,నటుల రెమ్యూనిరేషన్ ల దృష్ట్యా హిందీ మార్కెట్ టాలీవుడ్ ,కోలీవుడ్ ఇక శాండిలీవూడ్ కంటే పెద్ద ఇండస్ట్రీ గా చెప్పుకొనే వాళ్ళు. బాహుబలి ,పుష్ప ,కెజిఫ్,విక్రమ్,RRR ,పొన్నియన్ సెల్వం,కాంతారా, వంటి బ్లాక్ బస్టర్ లు మన సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ కి సౌత్ సినిమా ని స్థాయి ని చూపించడమే కాకుండా సౌత్ ,నార్త్ అనే తేడా ని చెరిపేసి ఇండియన్ సినిమా గా మారిపోయింది.

chiru balaya

ఇక ఈ సంవత్సరం లో ఇండియన్ నుంచి రిలీజ్ అయినా సినిమా ల లో మన తెలుగు నుంచి అత్యధికమైన సక్సెస్ కలిగిన సినిమా లు వచ్చాయి.సంక్రాంతి కి రిలీజ్ అయినా సినిమా ల లో మెగా స్టార్ చిరంజీవి ,బాలయ్య గార్ల వాల్తేర్ వీరయ్య ,వీర సింహ రెడ్డి ల తో పాటు ధనుష్ సార్
బ్లాక్ బస్టర్ హిట్ల గా మిగిలాయి.ఇందులో వాల్తేర్ వీరయ్య దాదాపు 230 కోట్ల గ్రాస్ తో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్ట్ చేసిన తెలుగు సినిమా గా రికార్డు నెలకొల్పింది.ఇక ఆ తర్వాత రిలీజ్ అయినా చిన్న సినిమా ల లో రైటర్ పద్మభూషణ్,వినరో భాగ్యము విష్ణు కథ,బలగం,ధమ్కీ వంటి సినిమా లు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

virupaksha

మార్చ్ లో న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన పాన్ ఇండియన్ మూవీ దసరా తో నాని తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్సింగ్ ఫిలిం ని సాధించాడు,ఆక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ చేసిన విరూపాక్ష తో 100 కోట్ల కలెక్షన్స్ సాధించారు.ఇక ఇటీవల రిలీజ్ అయినా సమజవరాగమనా
తో శ్రీ విష్ణు 50 కోట్ల కలెక్షన్స్ సాధించగా అతి చిన్న సినిమా గా వచ్చిన బేబీ మూవీ సూపర్ టాక్ తో ఇప్పటికే 60 కోట్ల కలెక్షన్స్ సాధించి హౌసేఫుల్ రన్ తో కొనసాగుతోంది.ఇప్పటి వరకు మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయినా సినిమా ల లో దాదాపు 60 % సక్సెస్ రేట్ తో ఉన్న తెలుగు నుంచి రాబోతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ బ్రో ,చిరంజీవి భోళా శంకర్ ,ప్రభాస్ సాలార్ అలానే బాలయ్య బాబు ,రామ్ ,వెంకటేష్ సినిమా లు రానున్న సందర్భం లో టాలీవుడ్ కి మరికొన్ని బ్లాక్ బస్టర్ లు రాబోతున్నాయి.అందుకే 2023 ని గోల్డెన్ ఇయర్ గా అంటున్నారు.

baby

1935 views