Rudrangi: రుద్రంగి మూవీ రివ్యూ!

Posted by venditeravaartha, July 7, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు గారు మెయిన్ లీడ్ నుంచి విలన్ రోల్స్ చేస్తున్నప్పటి నుంచి తన గ్రాఫ్ పీక్ స్టేజి కి చేరుకుంది.బాలకృష్ణ గారి లెజెండ్ సినిమా తో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత వరుస సినిమా ఆఫర్ ల తో ప్రస్తుతం బిజీ గా ఉన్నారు.అయితే తాను మెయిన్ లీడ్ లో మమతా మోహన్ దాస్ ,విమల రామన్,ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రా లో రుద్రంగి సినిమా ఈ రోజు జులై 7 న ప్రపంచ వ్యాప్తముగా రిలీజ్ అయింది.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జగపతి బాబు గారు చెప్పినట్లు లెజెండ్ సినిమా తర్వాత ఆ స్థాయి క్యారెక్టర్ తనకి లభించిందా ? లేదా సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

rudrangi

కథ: రుద్రంగి సినిమా ఇండియా కి స్వతంత్రం రాకముందు జరిగిన ఒక క్రూరమైన కథ,అప్పటి
భీమ్ రావ్ దేశ్‌ముఖ్ (జగపతి బాబు) గారు ఒక క్రూరమైన రాజు మరియు అతనికి స్త్రీ ల మీద
వివక్ష ని చూపిస్తూ ఉంటారు.అతనికి మల్లేష్(ఆశిష్ గాంధీ) చాల నమ్మకమైన వ్యక్తి. భీమ్ రావ్ రుద్రంగిని పాలిస్తాడు మరియు అక్కడ స్థానిక ప్రజలను తన బానిసలుగా చూస్తాడు. మీరా భాయ్ (విమలా రామన్) అతని భార్య, కానీ అతని అపరిమిత కామాన్ని తీర్చుకోవడానికి, అతను మరొక మహిళ జ్వాలా భాయ్ (మమతా మోహన్‌దాస్)ని వివాహం చేసుకుంటాడు.కానీ భీమ్ రావు జ్వాలా భాయ్ యొక్క స్వభావంతో సంతోషంగా ఉండడు మరియు అతను ఆమెను తన నుండి దూరంగా ఉండమని కోరతాడు. ఒకరోజు భీమ్ రావు రుద్రాంగి (గానవి లక్ష్మణ్) అనే స్త్రీని చూస్తాడు మరియు ఆమె అందానికి దాసోహం అవుతాడు, భీమ్ రావ్ రుద్రాంగితో శారీరక సంబంధం పెట్టుకోవాలి అని తీవ్రంగా కష్టపడుతున్న సమయం లో ఆమె గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ విషయం ఏమిటి? అది అక్కడి స్థానిక ప్రజల భవితవ్యాన్ని ఎలా మార్చింది అనేది మిగిలిన కథ.

jagapathi babu
విశ్లేషణ:రుద్రంగి సినిమా లో ప్రధాన పాత్రలు అయినా జగపతి బాబు ,మమతా మోహన్ దాస్
విమల రామన్ ,ఆశిష్ గాంధీ లు సినిమా లో వారి పరిధికి మించి నటించారు అని చెప్పొచ్చు
ఈ చిత్ర దర్శకుడు అజయ్ సామ్రాట్ తాను రాసుకున్న కథ ని ఎలా చూపించాలి అని ఆశ పడ్డాడో అలానే స్క్రీన్ మీద చూపించాడు.ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో జగపతి బాబు ,ఆశిష్ గాంధీ ల మధ్య వచ్చే సీన్ లు అయితే హైలైట్ గా నిలిచాయి.జగపతి బాబు భార్య గా విమల రామన్ ఇంకా తన రెండవ భార్య గా మమతా మోహన్ దాస్ లు మొదటి భాగం లో సినిమా ని ఒక రేంజ్ కి తీసుకునిపోవడానికి తమ కృషి ని చేసారు అనే చెప్పాలి.సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం జరిగే పోరు లో ఎవరు గెలుస్తారు అనేది చాల స్పష్టం గా చూపించారు.
పాజిటివ్:జగపతి బాబు ,మమతా మోహన్ దాస్ ,ఫస్ట్ హాఫ్ ,కథ ,స్క్రీన్ ప్లే.
నెగటివ్:సెకండ్ హాఫ్ ,లెంగ్త్.
రేటింగ్:3 .25 / 5
చివరగా రుద్రంగి మూవీ జగపతి బాబు గారి వన్ మాన్ షో గా చెప్పుకోవచ్చు.

 

2549 views