Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Ram Charan:శంకర్ తో సినిమా ఒప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు – రామ్ చరణ్

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరో హీరోలు ఉన్నప్పటికీ చిరంజీవి అంటే అందరికీ విపరీతమైన అభిమానం. ఎందుకంటే స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన రీతిలో స్టార్ డమ్ సంపాదించాడు కాబట్టి ఆయన అందరికి నచ్చాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని హీరోగా మంచి విజయాన్ని అందుకుంటున్నాడు.

తన రెండో సినిమా మగధీరతో నట విశ్వరూపం చూపి రంగస్థలంలో చిట్టిబాబు పాత్రలో జీవించేశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యాక్టింగ్ లో పీక్ స్టేజ్ కు చేరుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ ఇండియా హీరోగా తన స్టార్ డమ్ ని విశ్వ వ్యాప్తం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించాలంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు శంకర్. ఆయన పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి వాడు. అలాంటి సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది అంటే రామ్ చరణ్ తన తదుపరి సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకోబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. దీంతో పాటు శంకర్ ఇండియన్ 2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక గేమ్ చేంజర్ మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో.. ఏం చేయాలో తోచని స్థితిలో రామ్ చరణ్ ఉన్నాడు. విసిగిపోయిన రామ్ చరణ్, శంకర్‌తో సినిమా చేయడం కంటే రెండేళ్లు ఇంట్లో కూర్చోవడం మంచిదని తన సన్నిహితులతో సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చరణ్ ఆ వ్యాఖ్యను జోక్ గా అన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version